సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 15:47:48

కలర్‌పెన్సిల్స్‌తో గిటార్‌.. ఎలా తయారుచేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు..!

కలర్‌పెన్సిల్స్‌తో గిటార్‌.. ఎలా తయారుచేశాడో చూస్తే ఆశ్చర్యపోతారు..!

న్యూయార్క్‌: మీకు కలర్‌ పెన్సిల్స్‌ ఇస్తే ఏం చేస్తారు? ఏం చేస్తారు ఓపిక, సమయం ఉంటే డ్రాయింగ్‌ వేస్తారు కదా.. కానీ ఒకతను ఏకంగా గిటార్‌ తయారుచేసి అబ్బురపరిచాడు. రంగురంగుల పెన్సిల్స్‌ను అందంగా పేర్చి వినసొంపైన సంగీతాన్నిచ్చే వాయిద్య పరికరాన్ని తయారుచేసి ఔరా అనిపించాడు. ఈ వీడియో సోషల్‌ మీడియలో వైరల్‌ అవుతున్నది. 

గిటార్‌ రూపొందించేందుకు కళాకారుడు 1200 కలర్ పెన్సిల్స్ సేకరించాడు. మొదట వాటి చివరలను కత్తిరించాడు. కార్బన్‌ పేపర్‌పై గీసిన గిటార్‌ ఆకృతిలో ఒక్కొక్కటీ అతికించాడు. అనతరం దాన్ని గిటార్‌ ఆకృతిలో కత్తిరించాడు. తీగలను అనుసంధానించాడు. దీంతో కలర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ గిటార్‌ రెడీ అయ్యింది. అయితే, దీనిని వేలం వేయనున్నాడు. వచ్చిన డబ్బులతో అమెరికాలో కొవిడ్‌ బారినపడ్డ పేదలకు భోజనం అందజేయనున్నారు. మూడు నిమిషాల పంతొమ్మిది సెకన్ల నిడివిగల ఈ వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్‌ చేస్తోంది. యూట్యూబ్‌ తన ట్విట్టర్‌ పేజీలో ఈ వీడియో పెట్టగా, 555 రీట్వీట్లు, 3,0100 లైక్స్‌ వచ్చాయి. 99,000 మంది దీన్ని వీక్షించారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo