ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 09:54:38

అత‌ని ఇంట్లో 20 కొండ‌చిలువలు.. ఎందుకో తెలుసా?

అత‌ని ఇంట్లో 20 కొండ‌చిలువలు.. ఎందుకో తెలుసా?

ఎవ‌రైనా ఇంట్లో పెట్స్ పెంచుకుంటారు. పెట్స్ అంటే.. ఏ పిల్లో, కుక్క, కుందేలు లాంటి వాటిని పెంచుకుంటారు. కానీ మార్టిన్ బోన్‌ మాత్రం ఏకంగా కొండ‌చిలువ‌ను పెంచుకుంటున్నాడు. అది కూడా ఒక‌టి అయితే ప‌ర్వాలేదు. ఏకంగా 20 పైథాన్‌ల‌ను పెంచుకుంటున్నాడు. అది కూడా త‌న ఇంట్లోనే. 20 పైథాన్‌ల‌లో 10 మాత్రం 10 అడుగులకు పైగా పొడ‌వున్నాయి. వీటితో స‌రిపెట్టుకోలేదు. 585 ఎలుక‌లు, 46 కుందేళ్లు  కూడా ఉన్నాయి.

ఇది తెలిసిన ఇరుగుపొరుగు వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఉటాలోని హ‌ల్లాడేలోని అత‌ని ఇంటిపై పోలీసులు దాడి చేసి మార్టిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొండ‌చిలువ‌లు‌, ఎలుక‌లు, కుందేళ్ల‌ను పోలీసులు పుశువైద్యుల వ‌ద్ద‌కు పంపించి ప‌రీక్ష చేయించారు. అస‌లు ఒక పైథాన్‌ను చూస్తేనే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతారు. అలాంటిది అత‌ను ఇన్ని పైథాన్‌ల‌ను ఎలా పెంచుకుంటున్నాడో అని అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 


logo