గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 22, 2020 , 17:06:11

అతడి సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది..!

అతడి సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది..!

న్యూయార్క్‌: అతడికి స్నోబోర్డింగ్‌ అంటే మక్కువ. ఐస్‌ స్కేటింగ్‌లో అత్యంత ప్రతిభ ఉంది. నిత్యం సాధన చేస్తుండేవాడు. వివిధ పోటీల్లోనూ పాల్గొన్నాడు. కానీ ఒకరోజు భారీ ప్రమాదం జరిగింది. దీంతో అతడికి అత్యవసర శస్త్రచికిత్సలు జరిగాయి. అతడి నడుంభాగం పనిచేయకుండా అయిపోయింది. ఇక అతడి స్నోబోర్డింగ్‌ కెరీర్‌ ముగిసిందని బంధువులు, కుటుంబ సభ్యులు అనుకున్నారు. కానీ, అతడి సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. వీల్‌చైర్‌ సాయంతో స్కేటింగ్‌ చేసి, ప్రతిభకు వైకల్యం అడ్డుకాదని నిరూపించాడు ఓ అమెరికన్‌ అథ్లెట్‌.

టోనీ థాగ్మార్టిన్ స్నోబోర్డర్. 2017 లో ప్రమాదం తర్వాత వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు. కానీ టోనీ తన అభిరుచిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. ప్రమాదంనుంచి పూర్తిగా కోలుకున్నాక వీల్‌చైర్‌తో స్కేటింగ్‌ చేయడం సాధన చేశాడు. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయి వీల్‌చైర్‌ స్కేటర్‌గా అవతరించాడు. అతడు స్కేటింగ్‌ చేస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. టోనీ నార్త్ అమెరికన్ చాంపియన్‌షిప్‌లో రజతం, యూఎస్‌ఏ నేషనల్ చాంపియన్‌షిప్ ఆఫ్ స్కేట్‌బోర్డింగ్‌లో రెండోస్థానంలో నిలిచి విజయవంతమైన అథ్లెట్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఎంతో మందికి కోచింగ్‌ ఇస్తున్నాడు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo