వాషింగ్టన్: ఒక వ్యక్తి కదులుతున్న విమానం నుంచి దూకాడు. దీనికి ముందు కాక్‌పిట్‌లోకి ప్రవేశించేందుకు అతడు ప్రయత్నించాడు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సాల్ట్ లేక్ సిటీకి స్కైవెస్ట్ నడుపుతున్న యునైటెడ్ ఎక్స్‌ప్రెస్ విమానం 5365 శుక్రవారం రాత్రి 7 గంటల తరువాత ఒక గేట్ నుంచి కదులుతున్నది. ఇంతలో ఒక ప్రయాణికుడు ఫ్లైట్ నుండి నిష్క్రమించడానికి ప్రయత్నించాడు. మొదట అతడు కాక్‌పిట్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. తరువాత ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం నుంచి కిందకు దూకాడు. విషయం తెలుసుకున్న ఎయిర్ పోర్ట్ అధికారులు గాయపడిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రథమ చికిత్స చేసి అనంతరం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో టేకాఫ్‌కు సిద్ధమైన ఆ విమానం మూడు గంటలపాటు ఎయిర్‌పోర్టులో నిలిచిపోయింది.