ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Sep 15, 2020 , 19:16:37

భార్య కోసం వీల్‌చైర్‌ను బైక్‌లా మార్చిన భ‌ర్త‌.. దీంతో ప‌ర్వ‌తాలు కూడా ఎక్కొచ్చు!

భార్య కోసం వీల్‌చైర్‌ను బైక్‌లా మార్చిన భ‌ర్త‌.. దీంతో ప‌ర్వ‌తాలు కూడా ఎక్కొచ్చు!

ఎప్పుడూ ఎడ్వెంచ‌ర్లు అంటూ తిరిగే భార్య వీల్‌చైర్‌కే ప‌రిమిత‌మ‌వ్వ‌డం అత‌ని హృదయం ద‌హించివేసింది. వీల్‌చైర్‌తో ఎటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితి. ఇంటి ఆవ‌ర‌ణ‌లో తిర‌గాల‌న్నా మ‌రొక‌రి స‌హాయం కావాలి. అందుకు ఆమె భ‌ర్త వీల్‌చైర్‌ను స‌రికొత్త‌గా మార్చేశాడు. అదే బైక్ రూపంలోకి. దీన్ని రోడ్డు మీదే కాదు. రాళ్లు ర‌ప్ప‌లు, ప‌ర్వ‌తాలు, కొండ‌ల‌ను సైతం ఎక్క‌డానికి వీలుగా ఉండే ఈ బైక్‌ను 'రిగ్' అని పేరు పెట్టాడు. అత‌ను ఎవ‌రో కాదు యూట్యూబ్ స్టార్ జాక్ నేల్స‌న్. అత‌ని భార్య క్యాంబ్రీ 2005లో గుర్ర‌పు స్వారీ చేస్తూ ప్ర‌మాదానికి గురైంది. దీంతో ఆమె న‌డుము కింది భాగంలో ప‌క్ష‌వాతం వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ఆమె వీల్‌చైర్‌కు అంకిత‌మైంది.

క్యాంబ్రీ ఇష్టాఇష్టాలు తెలిసినవాడు జాక్ ఒక‌డే. భార్య‌కోసం రిగ్‌ను త‌యారు చేసి ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో ఆమె ఎవ‌రి సాయం లేకుండానే ఇష్ట‌మొచ్చిన ప్ర‌దేశానికి వెళ్తున్న‌ది. అయితే ఇది ఎల‌క్ట్రిక్ బైక్‌. దీన్ని ఫుల్ చార్జ్ పెడితే 15 నుంచి 34 కి.మీ. వ‌ర‌కు వెళ్లొచ్చు. బైక్‌కు పెద్ద శ‌బ్దం కూడా రాదు. క్యాంబ్రీ వేగం తెలిసిన భ‌ర్త గంట‌కు 20 కి.మీ వెళ్లేలా త‌యారు చేశారు. ఈ బైక్‌కు నాలుగు చ‌క్రాలు అమ‌ర్చి మ‌ధ్య‌ల‌ కూర్చోవ‌డానికి సీటు చాలామంచి సౌక‌ర్యంగా త‌యారు చేశాడు. ఇది ఈమెకు మాత్ర‌మే కాకుండా త‌న‌లా బాధ‌ప‌డేవారికి కూడా త‌యారు చేసి అమ్ముతున్నాడు. జాక్ వాటిని త‌క్కువ ధ‌ర‌కే అమ్ముతూ అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. logo