శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 26, 2021 , 13:25:17

55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..

55 లక్షలు ఖర్చుపెట్టి 2 ఇంచులు పెరిగాడు..

టెక్సాస్‌ : సరిగ్గా ఐదేండ్ల క్రితం.. పొడువు పెరిగేందుకు సర్జరీ చేయించుకుని మంచానికే పరిమితమైన మన హైదరాబాదీ నిఖిల్‌ రెడ్డి జ్ఞాపకం ఉన్నాడు కదూ..! 5.7 పొడవుఉన్న నిఖిల్‌ సర్జరీలు చేయించుకుని, మందులు తిని, నానా ఇబ్బందులు పడి చివరకు ఇంచున్నర పెరిగాడని అప్పట్లో వైద్యులు ప్రకటించారు. సరిగ్గా ఇలాంటి ఆలోచనతో ముందుకొచ్చిన అమెరికాకు చెందిన ఓ యువకుడు రూ.55 లక్షలకు ఖర్చుపెట్టి 2 ఇంచుల పొడవు పెరిగాడు. 

అమెరికాలోని టెక్సాస్‌లో నివసిస్తున్న అల్ఫోన్సో ఫ్లోర్స్ అనే వ్యక్తి కాస్మెటిక్ సర్జరీతో తన పొడవును పెంచుకున్నాడు. ఇందుకు అక్షరాల రూ.55 లక్షలు ఖర్చు చేశాడు. అతని ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు ఉండగా.. సర్జరీ తర్వాత 6 అడుగుల 1 అంగుళానికి చేరుకున్నాడు. 28 ఏండ్ల వయసున్న అల్ఫోన్సో.. 12 ఏండ్ల వయస్సు నుంచి బాస్కెట్‌బాల్ క్రీడాకారుడిలా తయారవ్వాలని కలలు కన్నాడు. అందుకు తన శరీరం పొడువు సరిపోదని, మరింత పొడవు కావాలని కోరుకున్నాడు. ఇందుకు శస్త్రచికిత్స చేయించుకునేందుకు ఏర్పాట్లు చేయగా.. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్రంగా వ్యతిరేకించారు. వృత్తిరీత్యా ఫ్రీలాన్స్ రచయిత అయిన అల్ఫోన్సోకు లాస్ వెగాస్‌లోని ది లింబ్ ప్లాస్ట్ ఎక్స్ ఇస్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్ కెవిన్ డేబీపర్షాద్ సర్జరీ చేశారు. శరీర పొడవు పెంచడానికి ఎముక పొడవు పెరుగాలని దవాఖాన తెలిపింది. ఇందుకు రూ.55 లక్షలు ఫీజుగా చెల్లించుకున్నది. 

జోర్డాన్‌లా కనిపించాలని.. 

‘నా అభిమాన ఆటగాళ్లు మైఖేల్ జోర్డాన్, ఫిల్ జాక్సన్, కోబ్ బ్రయంట్ మాదిరిగా కనిపించేందుకు ఎంతో శ్రమపడ్డాను. కలలుకన్నాను. అయితే నా శరీరం పొడవు తక్కువగా ఉండటంతో సర్జరీ చేయించుకునేందుకు కూడా సిద్ధమయ్యాను. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉండి రెండు ఇంచుల పొడవును సంపాదించాను’ అని చెప్తున్నారు అల్ఫోన్సో ఫ్లోర్స్‌.

శస్త్రచికిత్స చేశారిలా..

రోగి తొడలో 6 చిన్న కోతలు చేసినట్లు శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ కెవిన్ చెప్పారు. పొడవైన కాలు ఎముక ఇక్కడి నుంచి వేరు చేశారు. అప్పుడు ఈ ఎముక నుంచి కొత్త దానిని జోడించారు. కొత్త ఇంప్లాంట్‌ను రిమోట్ కంట్రోల్ చేయవచ్చు. రోగి ఇంట్లో దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఎముక దాని స్థిర పరిమాణానికి వచ్చే వరకు ఈ ఇంప్లాంట్ చాలా నెమ్మదిగా పెరుగుతూనే ఉంటుంది. శస్త్రచికిత్స రెండవ రోజున నడిచేందుకు కొంత కష్టపడ్డ అల్ఫోన్సో.. పడుకోవడానికి మాత్రమే ఇబ్బంది పడినట్లు ఆ దవాఖాన సిబ్బంది చెప్తున్నారు. శరీర పొడవు పెంచడానికి పెద్ద ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదని, చిన్న కోతల ద్వారా పూర్తిచేయవచ్చునని డాక్టర్‌ కెవిన్‌ అంటున్నారు.

ఇవి కూడా చదవండి..

చరిత్రలోఈరోజు.. రాజ్యంగం అమలులోకి వచ్చిన రోజు

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo