గురువారం 29 అక్టోబర్ 2020
International - Sep 28, 2020 , 19:41:33

తన్నితే తన్నిందిగానీ.. ప్రపోజల్‌కు ఓకే చెప్పింది

తన్నితే తన్నిందిగానీ.. ప్రపోజల్‌కు ఓకే చెప్పింది

ప్రియురాలికి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా వ్యవహరిస్తుంటారు. చాలా పెళ్లి ప్రపోజల్స్‌ యెస్‌ తో ముగిస్తుండటం సంతోషకరమైన విషయం కాగా, ఓ ప్రేమికుడు తన ప్రపోజల్‌ను చెప్పడానికి వెళ్లగా ప్రియురాలు తన కాలితో ఆయన ముఖంపై తన్నింది. చివరకు అతగాడి ప్రపోజల్‌కు యెస్‌ చెప్పడంతో కథ సుఖాంతమైంది. కాలుతో తన్నడమేంటి..? యెస్‌ చెప్పడమేంటి..? అని సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు కదూ! ఇది నిజంగా నిజమండి. 

ఓ వ్యక్తి తన ప్రియురాలికి ప్రపోజ్‌ చేసేందుకు ఆమె కూర్చున్న బోటు వద్దకు చేరుకోగా.. ఆమె అంతే పారవశ్యంతో అతడిని ముద్దాడేందుకు ముందుకు వంగింది. ఇంతలో పడవ పక్కకు ఒరగడంతో పట్టుతప్పి సదరు అమ్మాయిగారి కాలు కాస్తా అబ్బాయిగారి ముఖంపైకి చేరి గట్టిగా తగిలింది. దాంతో పాపం ప్రియుడు నీటిలో పడిపోయాడు. అనంతరం అక్కడే ఉన్న కొందరు సదరు ప్రేమికుడిని ఒడ్డుకు చేర్చారు. ఎలాంటి గాయాలు లేకుండా ఒడ్డుకు చేరుకున్నాడు. ఈ ప్రపోజల్‌ వీడియో తీసిన థియో శాంటోనాస్‌ సదరు వ్యక్తితో మాట్లాడగా.. అంతా బాగానే ఉన్నదని.. కావాలని తన్నలేదని, పట్టుతప్పి అలా జరిగిందని, ఏదేమైనా నా ప్రపోజల్‌కు యెస్‌ చెప్పింది.. అంటూ సదరు వ్యక్తి సంతోషంగా చెప్పాడంట. థియో శాంటోనాస్‌ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇలాంటి వీడియోలు ఇటీవల చాలా వైరల్ అయ్యాయి. ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన ప్రేయసికి ప్రపోజ్ చేయడానికి కొవ్వొత్తులను వెలిగించడంతో తానుండే అపార్ట్‌మెంట్‌ పూర్తిగా తగలబడిపోయింది. అందుకని అబ్బాయిల్లారా ప్రపోజ్‌ చేసేటప్పుడు కాస్తా ముందు, వెనకాల కూడా చూసుకొండి.logo