ఆదివారం 29 నవంబర్ 2020
International - Nov 07, 2020 , 16:24:04

నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ట్రంప్‌ స్పీచ్‌ డీజే రీమిక్స్‌!

నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న ట్రంప్‌ స్పీచ్‌ డీజే రీమిక్స్‌!

హైదరాబాద్‌: ఇప్పుడంతా డీజే రీమిక్స్‌ల హవా నడుస్తోంది. కొన్ని ఫేమస్‌ అయిన వర్డ్స్‌.. వ్యక్తుల స్పీచ్‌లను డీజే రీమిక్స్‌ కింద మార్చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం యశ్రాజ్ ముఖాటే అనే సంగీత దర్శకుడు ప్రసిద్ధ సీరియల్ 'సాత్ నిభానా సాథియా' లోని ఒక సన్నివేశాన్ని రీమిక్స్ చేశాడు. ఇప్పుడు అలాంటి మరొక అద్భుత రీమిక్స్‌ వైరల్‌ అయ్యింది. అది ఎవరిదో కాదు.. అమెరికా ప్రెసిడెంట్‌, ప్రస్తుత ప్రెసిడెంట్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ స్పీచ్‌. 

మయూర్ జుమాని అనే సంగీత దర్శకుడు ట్రంప్‌  ప్రసంగం నుంచి కొన్ని వ్యాఖ్యాలు తీసుకొని డీజే రీమిక్స్‌ చేశాడు. అహ్మదాబాద్‌లో జరిగిన  'నమస్తే ట్రంప్' కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగించినప్పుడు ‘స్వామి వివేకానంద’పేరును వెరైటీగా పలికాడు. దాంతోనే ఈ డీజే రీమిక్స్‌ను ప్రారంభించారు. ఈ వీడియోను 'ది వివేకమునంద్ మిక్స్' అని పిలుస్తున్నారు.  ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. దీన్ని ట్విట్టర్‌లో పెట్టగా 423 రీట్వీట్లు, 1600 లైక్స్‌ వచ్చాయి.  2 లక్షల మందికిపైగా వీక్షించారు.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.