గురువారం 29 అక్టోబర్ 2020
International - Oct 06, 2020 , 15:18:26

ప్రేమ ఎక్కువై సింహం నోటిలో చేయి పెట్టాడు.. చివ‌రికీ!

ప్రేమ ఎక్కువై సింహం నోటిలో చేయి పెట్టాడు.. చివ‌రికీ!

సింహం తినేట‌ప్పుడు చూడాల‌నుకోవ‌చ్చు. త‌ప్పులేదు! కానీ.. సింహానికి స్వ‌యంగా తినిపించాల‌నుకోకూడ‌దు! అలా అనిపిస్తే ఆ చేయి ఉండ‌దు. ఎప్పుడైనా జూ పార్క్‌కి వెళ్తే వెళ్లామా? జ‌ంతువుల‌ను చూశామా? వ‌చ్చామా అన్న‌ట్లుండాలి. వేషాలు వేస్తే జంతువుల చేతిలో బ‌ల‌వ్వాల్సిందే. ఓ వ్య‌క్తి సింహం ద‌గ్గ‌ర‌కు వెళ్లి చేయి చాచాడు. సింహం ఆ చేతిని మిస్ అవ్వ‌కుండా ల‌టుక్కున నోట్లో పెట్టేసుకుంది. అత‌ను ఆ రోజు న‌క్క‌తోక తొక్కి వ‌చ్చిన‌ట్లున్నాడు ఎలాగోల సేఫ్‌గా బ‌య‌ట ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో  అత‌ని అరుపులకు న‌లుదిక్కులు కంపించిన‌ట్లు అయింది. అత‌ను అంత‌లా అరుస్తున్నా ఒక్క‌రు కూడా అత‌ని వ‌ద్ద‌కు వెళ్ల‌లేదు. పైగా చేతిలోని మొబైల్‌తో వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త వైర‌ల్ అయింది. 'జూ'కి ఇంత‌టి మ‌హానుభావులు ఎందుకు వ‌స్తారో అర్థం కాదంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 


logo