శుక్రవారం 23 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 19:16:58

గర్భిణి సాహసం.. షార్క్‌నుంచి భర్తను కాపాడుకుంది..!

గర్భిణి సాహసం.. షార్క్‌నుంచి భర్తను కాపాడుకుంది..!

న్యూయార్క్‌: స్నార్కెలింగ్‌ యాత్ర చేస్తున్న ఓ కుటుంబంలోని ఒకరు షార్క్‌కు చిక్కారు. దీంతో వారంతా గట్టిగా అరవడం మొదలెట్టారు. అతడి భార్య గర్భిణి. భర్త రక్తం మరకలు చూసి, ఒక్క ఉదుటన నీళ్లలో దూకింది. షార్క్‌నుంచి భర్త ప్రాణాలు కాపాడుకున్నది. సాహస మహిళగా గుర్తింపు పొందింది.

అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది ఈ ఘటన. సెప్టెంబర్ 20 న మార్గోట్ డ్యూక్స్ ఎడ్డీ, తన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, భర్త ఆండ్రూ ఎడ్డీతో కలిసి పడవలో వెళ్తున్నారు. కానీ, అకస్మాత్తుగా ఆండ్రూ పడవ నుంచి జారిపోయి నీటిలో పడ్డాడు. ఒక పెద్ద సొరచేపకు చిక్కాడు. అతడి రక్తం నీటిపై తేలగా, ఏమాత్రం ఆలోచించకుండా డ్యూక్స్‌ నీటిలోకి దూకేసింది. ఇతర కుటుంబ సభ్యుల సహాయంతో భర్తను షార్క్‌నుంచి కాపాడుకుంది. అనంతరం ఆండ్రూను సోంబ్రెరో బీచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అతడికి చికిత్స చేశారు. మయామిలోని జాక్సన్ మెమోరియల్ హాస్పిటల్‌లో చేర్పించారు. కాగా, తెగువచూపి భర్తను కాపాడుకున్న డ్యూక్స్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo