శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 17:35:08

బ్యాంకు ఖాతాలో రూ.కోటి వచ్చిపడ్డాయి.. వృద్ధుడి షాక్‌!

బ్యాంకు ఖాతాలో రూ.కోటి వచ్చిపడ్డాయి.. వృద్ధుడి షాక్‌!

మిన్నెసోటా: మీ ఖాతాలో రూ. కోటి వచ్చిపడితే మీ ఫీలింగ్‌ ఎలా ఉంటుంది..! ఓ పక్క ఆశ్చర్యం.. ఆందోళనతోపాటు మరోపక్క ఆనందం కూడా ఉంటుంది కదా. ఇలాంటి పరిస్థితే అమెరికాలోని ఓ వృద్ధుడికి ఎదురైంది. అతడి బ్యాంకు ఖాతాలో రూ. కోటి వచ్చిపడడంతో అతడు షాక్‌కు గురయ్యాడు. రెండు వారాలైనా ఎవరూ సంప్రదించకపోవడంతో ఆ కోటి తనదే అనుకున్నాడు.

అమెరికాలోని మిన్నెసోటాలోగల క్రిస్టల్‌కు చెందిన థామస్ ఫ్లాహింగ్‌కు 73 ఏళ్లు. అతడికి స్థానిక సన్‌రైజ్ బ్యాంకులో ఖాతా ఉంది. అయితే, ఇటీవల అందులో 150,000 అమెరికన్‌ డాలర్లు అంటే రూ. 1.09 కోట్లు జమయ్యాయి. మొదట బ్యాంక్‌ తప్పిదం వల్ల వచ్చాయేమో అనుకున్నాడు. కానీ రెండు వారాలైనా ఎవరూ సంప్రదించలేదు. దీంతో ఆ డబ్బులతో ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. అలాగే, మెక్సికో పారిపోవాలని కూడా ఆలోచన చేశాడట.  అనంతరం ప్రభుత్వ సొమ్ము మనకెందుకులే బ్యాంకుకు వెళ్లి చెప్పేద్దాం అని డెసిషన్‌ తీసుకున్నాడు. ఆ లోపే బ్యాంక్‌ తన లోపాన్ని గుర్తించింది. ఫ్లాహింగ్‌ ఖాతానుంచి ఆ సొమ్మును తీసేసుకుంది.  


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo