బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 22, 2020 , 16:37:08

చీటింగ్ చేయాలనుకుంటే.. స్పెల్లింగ్‌ పట్టించింది..

చీటింగ్ చేయాలనుకుంటే.. స్పెల్లింగ్‌ పట్టించింది..

న్యూయార్క్: ఓ నేరస్థుడు తాను చనిపోయినట్లు నకిలీ సర్టిఫికేట్లు అందజేసి శిక్ష నుంచి తప్పించుకోవాలనుకోగా.. మరణ ధ్రువీకరణపత్రంలో స్పెల్లింగ్‌ కాస్తా అతగాడి ఆటను పట్టించింది. 

న్యూయార్క్‌లోని హంటింగ్‌టన్‌కు చెందిన రాబర్ట్ బెర్గెర్ (25) లెక్సస్‌ వాహనాన్ని దొంగిలించడం, మరో ట్రక్కును దొంగిలించేందుకు యత్నించడం వంటి ఆరోపణలపై అరెస్ట్‌ చేశారు. ఈ కేసుల్లో ఏడాది జైలుశిక్ష పడే అవకాశాలు ఉన్నందున తన లాయర్‌తో కలిసి చనిపోయినట్లు మరణధ్రువీకరణ పత్రం అందజేసి కేసుల నుంచి తప్పించుకోవాలని ప్లాన్‌ వేశాడు. తన భార్యకు సర్టిఫికేట్‌ ఇచ్చి కోర్టుకు పంపాడు. మరణ ధ్రువీకరణ పత్రం న్యూజెర్సీకి చెందిన ఆరోగ్య శాఖ వైటల్ స్టాటిస్టిక్స్ అండ్ రిజిస్ట్రీ జారీ చేసిన అధికారిక పత్రం. అయితే, ఈ సర్టిఫికేట్‌లో ఒక చిన్న లోపాన్ని కనిపెట్టలేకపోయారు. రిజిస్ట్రీని "రెజిట్రీ" అని స్పెల్లింగ్ చేసినట్లు ప్రాసిక్యూటర్‌ గుర్తించాడు. ఆ పదం ఫాంట్ రకం, పరిమాణంలో మార్పులు కూడా ఉన్నాయని వారు తెలిపారు. దాంతో ఈ సర్టిఫికేట్‌ నకిలీదని ప్రాసిక్యూటర్‌ కోర్టుకు తెలిపాడు.

ప్రస్తుత నాటకంలో దోషిగా తేలితే బెర్గర్‌ అదనంగా నాలుగేండ్ల జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బెర్గెర్ సజీవంగానే ఉన్నాడు. తప్పుడు గుర్తింపును అందించాడని, కాథలిక్ కళాశాల నుంచి దొంగిలించాడనే ఆరోపణలతో సబర్బన్ ఫిలడెల్ఫియాలో అతడిని అరెస్టు చేశారు. పెన్సిల్వేనియా కోర్టు రికార్డుల ప్రకారం అతడికి జనవరిలో ఏడాది జైలు శిక్ష కూడా విధించబడింది.


logo