ఆదివారం 29 మార్చి 2020
International - Mar 24, 2020 , 16:08:32

చైనాలో మ‌రో వైర‌స్‌...ఒక‌రి మృతి

చైనాలో మ‌రో వైర‌స్‌...ఒక‌రి మృతి

క‌రోనాతో అత‌లాకుత‌మైన చైనాకు మ‌రో త‌ల‌నొప్పి ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే క‌రోనాతో వేలమంది మృత్యువాత ప‌డ‌డంతో..ఈ ఘ‌ట‌న నుంచి కోలుకుంటున్న డ్రాగ‌న్ కంట్రికి మ‌రో వైర‌స్ భ‌య‌పెడుతోంది.  చైనాలోని షాంగ్డాండ్ ప్రొవియ‌న్స్‌లో హంటా వైర‌స్‌ను గుర్తించారు. ఇక్క‌డ 39 ఏండ్ల వ‌య‌సున్న ఓ వ్య‌క్తి  హంటావైర‌స్ బారిన‌ప‌డి చ‌నిపోయాడు. కాగా 1959లో ఈ వైర‌స్‌ను మొద‌టిసారి గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన వ్యాక్సిన్ 2016 నుంచి అందుబాటులో ఉంది.  ప్ర‌పంచం మొత్తం  క‌రోనాతో వ‌ణికిపోతున్న ఈ త‌రుణంలో..హంటా వైర‌స్‌ రీ ఎంట్రీ ఇవ్వ‌డం ఒకింత‌ భ‌య‌పెడుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు.logo