మితిమీరిన కామోద్రేకం.. శృంగారం చేస్తూ వ్యక్తి మృతి

శృంగారం అదో రకమైన, ఆహ్లాదకరమైన అనుభూతి. ఆ కలయిక శరీరానికి ఎంతో ఉత్తేజాన్ని ఇస్తుంది. మధురానుభూతిని కలిగిస్తుంది. అలాంటి అనుభూతి కోసం ప్రతి జంట ఎదురుచూస్తుంటుంది.. కానీ మితిమీరిన కామోద్రేకంతో ఊగిపోతే.. ఊపిరి ఆగిపోయే ప్రమాదం ఉంది. ఓ వ్యక్తి మితిమీరిన కామోద్రేకంతో ఊగిపోయి ప్రాణాలను పొగొట్టుకున్నాడు.
ఆఫ్రికాలోని మాలవి దేశానికి చెందిన 35 ఏళ్ల చార్లెస్ మజవా ఓ సెక్స్ వర్కర్‌తో శృంగారంలో పాల్గొన్నాడు. ఇద్దరూ మంచి అనుభూతిని పొందుతుండగా.. చార్లెస్ మితిమీరిన కామోద్రేకానికి గురయ్యాడు. శృంగారం చేస్తూనే స్పృహ కోల్పోయాడు. అలా బెడ్ మీద ఒరిగిపోయాడు. కాసేపటికి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని వేశ్య తన ఫ్రెండ్స్‌కి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మితిమీరిన కామోద్రేకంతోనే..
చార్లెస్ శృంగార చర్యలో బాగా లీనమై మితిమీరిన కామోద్రేకానికి గురయ్యాడు. దాంతో అతని నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, మెదడులోని రక్త నాళాలు చిట్లిపోవడంతో ప్రాణాలు కోల్పోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. చార్లెస్ మృతితో వేశ్యకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెపై కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.
ఆరోగ్యకరమైన శృంగారం గుండెకు మంచిది
ఆరోగ్యకరమైన శృంగారం గుండెకు మంచిదని ఓ అధ్యయనంలో తేలింది. గుండెపోటుకు గురైన వారు.. ఆ తర్వాత ఆరోగ్యకరమైన శృంగారాన్ని చేస్తే మరికొంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంటుందని వెల్లడైంది. ఈ విషయాన్ని ప్రివేంటివ్ కార్డియాలజీకి సంబంధించిన యూరోపియన్ జర్నల్ వెల్లడించింది. శృంగారం పట్ల భయం ఉంటే అది శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.