బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Sep 01, 2020 , 13:09:20

13 వేల కేల‌రీల భోజ‌నాన్ని గంట‌లో ఆర‌గించిన స్మార్ట్‌బాయ్‌.. విరాళం కోస‌మేన‌ట‌!

13 వేల కేల‌రీల భోజ‌నాన్ని గంట‌లో ఆర‌గించిన స్మార్ట్‌బాయ్‌.. విరాళం కోస‌మేన‌ట‌!

ఒక మ‌నిషి మ‌హా అయితే ఎంత ఆహారం తింటాడు? ఎక్కువగా తినేవాళ్లు.. ఇద్ద‌రు, ముగ్గురు తినేంత ఆహారం తింటారేమో. దీనికే చూసిన‌వాళ్లు నోరెళ్ల‌బెడ‌తారు. కానీ ఇత‌ను మాత్రం ఏకంగా 13, 000 కేల‌రీలున్న ఆహారాన్ని గంట స‌మ‌యంలో పూర్తి చేశాడు. ఇత‌నికి ఆక‌లి అవ‌డంతో ఇలా చేయ‌లేదు. ఓ సంస్థ‌కు విరాళంగా ఇవ్వ‌డానికి రెస్టారెంట్‌లో ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నాడు. ఇత‌ను చూడ్డానికి స్మార్ట్‌గా క‌నిపిస్తున్న ఇంత ఆహారం ఎలా తిన్నాడా అని నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

యూకేలోని సుంద‌ర్‌ల్యాండ్‌కు చెందిన కైల్ గిబ్స‌న్ న్యూకాజిల్ వెస్ట్ ఎండ్ ఫుడ్‌బ్యాంక్ కోసం రూ. 39, 052 అలాగే రూ. 9, 762 విలువైన ఆహారాన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌కు విరాళంగా ఇచ్చాడు. 61 నిమిషాల్లో 8 బ‌ర్గ‌ర్లు, 4 హాట్ డాగ్లు,  రెండు భాగాల ఫ్రైస్, 3 శాండ్‌విచ్‌లు, ఒక బిఎల్‌టి, 2 మిల్క్‌షేక్‌లను ఆస్వాదిస్తూ తినేశాడు. కైల్ తింటున్న ఆహారంతోపాటు అత‌ని వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఇది 11 నిమిషాల‌పాటు న‌డుస్తుంది. మంచి ప‌నుల కోసం ఇలాంటి వెర్రి ప‌నుల‌ను ఇష్ట‌ప‌డుతుంటాన‌ని చెప్పుకొచ్చాడు. మిగ‌తా స‌మ‌యాల్లో ఆరోగ్యం గురించి శ్ర‌ద్ద వ‌‌హిస్తాడు. 22 ఏండ్ల కైల్ త‌ర‌చూ వ్యాయామ‌శాల‌లో ప‌నిచేస్తాడు. ఇత‌ను ఎక్కువ‌గా పండ్లు, కూర‌గాయ‌ల‌ను తింటూ ఉంటాడు. ఏదేమైనా అత‌ని ఆరోగ్యాన్ని కూడా లెక్క‌చేయ‌కుండా ఇత‌రుల కోసం చేస్తున్న ప‌నికి అంద‌రి నుంచి ప్ర‌సంశ‌లు పొందుతున్నాడు.       logo