గురువారం 22 అక్టోబర్ 2020
International - Sep 24, 2020 , 16:05:44

5 కిలోల ఆహారాన్ని 45 నిమిషాల్లో ఖ‌తం చేశాడు : వీడియో వైర‌ల్

5 కిలోల ఆహారాన్ని 45 నిమిషాల్లో ఖ‌తం చేశాడు :  వీడియో వైర‌ల్

ఈ మ‌ధ్య ఛాలెంజ్‌లు బాగానే న‌డుస్తున్నాయి. అయితే మాక్స్ అనే అత‌ను 'ఈటింగ్ చాలెంజ్'‌లో పాల్గొన్నాడు. 5 కిలోల ఆహారాన్ని 45 నిమిషాల్లో పూర్తి చేయ‌డం అన్న‌ది న‌మ్మ‌శ‌క్యంగా లేక‌పోయినా న‌మ్మితీరాలి. ఎందుకంటే ఇత‌ను ప్రూఫ్ కూడా చూపిస్తున్నాడు. ఈ స‌వాలుకు పెక్కామ్‌లోని మాన్జే అనే రెస్టారెంట్ వేదిక‌గా నిలిచింది. 5 నిమిషాల్లో 16 పిజ్జాలు, 2 నిమిషాల్లో 50 న‌గ్గెట్స్‌, 10 నిమిషాల్లో 30 డోన‌ట్స్‌ను తిన‌గ‌లిగాడు.

మాక్స్ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన అతిపెద్ద వాటిలో ఈ స‌వాలు ఒక‌టి అని చెప్పుకొచ్చాడు. 'మాక్స్ వ‌ర్సెస్ ఫుడ్'‌గా ఇత‌ను సోష‌ల్ మీడియాలో ప్ర‌సిద్ది చెందాడు. దీనివ‌ల్ల అత‌నికి 8, 000 కేల‌రీలు ల‌భించాయి. ఇటువంటి స‌వాల‌లో పాల్గొన‌డం ఇదే మొద‌టిసారి కాదు. తీసుకునే ప్ర‌తి స‌వాలు‌ను చాలా సీరియ‌స్‌గా తీసుకుంటాడు మాక్స్. మ‌రి ఇత‌ను అంత ఆహారాన్ని అంత సులువుగా ఎలా తిన్నాడో చూడాల‌ని ఉందా. అయితే కింది వీడియోలో చూసేయండి. logo