శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 22, 2020 , 11:42:31

బోర్ కొట్టింది..డ్రోన్ తో చేప‌ల వేట‌..వీడియో

బోర్ కొట్టింది..డ్రోన్ తో చేప‌ల వేట‌..వీడియో

లాక్ డౌన్ తో ప్ర‌జ‌లంతా ఎక్క‌డిక‌క్క‌డ ఇళ్లకే ప‌రిమితమైన విష‌యం ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. సిడ్నీకి చెందిన సామ్ రొమియోకు ప్ర‌తీ రోజు నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు చూడ‌టం, వ‌ర్కింగ్ ఫ్రం హోమ్ తో బిజీగా ఉన్నాడు. అయితే సామ్ రోమియోకు కొత్త ఆలోచ‌న వ‌చ్చింది. బీచ్ కు స‌మీపంలో ఉంటున్న సామ్ కు స‌ర‌దాగా చేప‌లు ప‌ట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చింది.

అయితే అంద‌రిలాగా కాకుండా డ్రోన్ తో చేప‌లు ప‌ట్టాడు సామ్‌. సామ్ రొమియో డ్రోన్ కు గాలం అమ‌ర్చి..త‌న ఇంట్లో నుంచి ఆ డ్రోన్ ను స‌ముద్రంపై నుంచి పోనిచ్చాడు. డ్రోన్ ను ఆపరేట్ చేస్తూ మొత్తానికి చేప‌ను ప‌ట్టాడు సామ్‌. నా బోర్ కొట్టి..డ్రోన్ తో చేప‌లు పట్టి నా ల‌క్ ఎలా ఉందో ప‌రీక్షించుకున్నా..మొత్తానికి చేప చిక్కింద‌న్నాడు సామ్.

అత‌నికి చేపను ప‌ట్టేందుకు 30 నిమిషాలు ప‌ట్టింద‌ట‌.ఈ స‌మ‌యంలో డ్రోన్ కు రెండు బ్యాట‌రీలు కూడా మార్చాడ‌ట‌. ఓ మై గాడ్..ఇది సాధ్య‌మవుతుంద‌ని తెలియ‌దు..అని ఓ నెటిజ‌న్ కామెంట్ పోస్ట్ చేయ‌గా..నీవు 3020 సంవ‌త్స‌రంలో ఉన్నావు వంటూ పోస్ట్ పెట్టాడు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo