బుధవారం 03 జూన్ 2020
International - May 17, 2020 , 11:30:10

మ్యూజియంలోకి చొర‌బ‌డి.. డైనోస‌ర్‌తో సెల్ఫీ

మ్యూజియంలోకి చొర‌బ‌డి..  డైనోస‌ర్‌తో సెల్ఫీ


హైద‌రాబాద్‌: ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మూసి ఉన్న మ్యూజియంలోకి అర్థ‌రాత్రి పూట ఓ వ్య‌క్తి చొర‌బ‌డి అక్క‌డ ఉన్న డైనోస‌ర్ పుర్రెల‌తో సెల్ఫీలు దిగాడు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఆస్ట్రేలియా పోలీసులు అత‌న్ని పట్టుకునేందుకు ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.  గ‌త ఆదివారం రాత్రి ఒంటి గంట‌కు ద ఆస్ట్రేలియ‌న్ మ్యూజియంలోకి ఓ వ్య‌క్తి అక్ర‌మంగా చొర‌బ‌డ్డాడు. మ్యూజియం మొత్తం క‌లియ‌తిరిగాడు.  అక్క‌డ ఉన్న ఓ డైనోస‌ర్ పుర్రె వ‌ద్ద సెల్ఫీలు దిగాడు. దాని నోట్లో త‌ల పెట్ట మ‌రీ ఫోటో దిగాడు.  సుమారు 40 నిమిషాల పాటు అత‌ను మ్యూజియంలో స్వేచ్ఛ‌గా సంచ‌రించాడు.  సీసీటీవీలో ఇదంతా చిక్కింది. చివ‌ర‌కు అత‌ను ఓ టోపీని, ఓ ఫోటోను ఎత్తుకెళ్లాడు.  ఈ కేసులు పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వాస్త‌వానికి పున‌ర్ నిర్మాణంలో భాగంగా సిడ్నీ మ్యూజియాన్ని గ‌త ఏడాది నుంచి మూసివేశారు. 


logo