ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 17:39:17

శానిటైజ‌ర్ కోసం బ్యాంక్‌లో చోరి.. ఆ త‌ర్వాత వ‌రుసగా మూడు దొంగ‌త‌నాలు!

శానిటైజ‌ర్ కోసం బ్యాంక్‌లో చోరి.. ఆ త‌ర్వాత వ‌రుసగా మూడు దొంగ‌త‌నాలు!

క‌రోనా నేప‌థ్యంలో బాగా డిమాండ్ పెరిగింది శానిటైజ‌ర్‌కే. దీనికి ఉన్న డిమాండ్ ఇప్పుడు దేనికీ లేదు. స‌బ్బు, నీరు అందుబాటులో లేన‌ప్పుడు చేతుల‌ను శుభ్రంగా ఉంచుకునేందుకు హ్యాండ్ శానిటైజ‌ర్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీటికి అంత డిమాండ్‌. అందుకేనేమో అమెరికాలోని అయోవాలో 39 ఏండ్ల మార్క్ గ్రే అనే యువ‌కుడు బ్యాంకు అద్దాల‌ను ప‌గుల‌గొట్టి మ‌రీ హ్యాండ్ శానిటైజ‌ర్‌ను దొంగిలించాడు.

దీని మీద పోలీసులు ద‌ర్యాప్తు చేసి కేసు న‌మోదు చేశారు. గ్రే బ్యాంకులోకి చొర‌బ‌డి శానిటైజ‌ర్‌ను దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు. ఇది ఒక‌టే కాదు ఆరోజే తెల్ల‌వారుజామున 1.45 గంట‌ల టైంలో నెబ్రాస్కా వీధిలో కౌన్సెలింగ్ సేవ గాజు త‌లుపుల‌ను ప‌గుల‌గొట్టి డ‌బ్బుకోసం వెతుకుతున్నాడ‌ని అత‌నిపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఏం దొంగిలించాడ‌ని ఇంకా వెలుగులోకి రాలేదు. ఆ త‌ర్వాత 5.45 నిమిషాల‌కు ఇటాలియ‌న్ రెస్టారెంట్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు గ్రేపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. పోలీసులు ఎట్ట‌కేల‌కు ఇత‌న్ని క‌నుగొని అరెస్ట్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌నిపై మూడు కేసులు మోప‌బ‌డ్డాయి. ఇప్పుడు ఇత‌న్ని స్థానిక జైలులో ఉంచారు. 

     


logo