ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Jul 28, 2020 , 19:07:36

మాస్క్‌ తెచ్చిన గొడవ..చాతిపై కొరికి పారిపోయిన వ్యక్తి!

మాస్క్‌ తెచ్చిన గొడవ..చాతిపై కొరికి పారిపోయిన వ్యక్తి!

ఐర్లాండ్‌: కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు మాస్క్‌ తప్పనిసరైంది. బయటకు వెళ్తే కచ్చితంగా ధరించాలని అటు ప్రభుత్వాలు, వైద్యులు సూచిస్తున్నా కొందరు లెక్కచేయడంలేదు. చాలామంది మంది బాధకు మాత్రమే పెట్టుకుంటున్నట్లు కనిపిస్తున్నది. ముక్కును కవర్‌ చేయకుండా మాస్క్‌ను తూతూమంత్రంగా ధరిస్తూ కనిపిస్తున్నారు. కాగా, ఐర్లాండ్‌ దేశంలో ఇలాంటి వ్యక్తే ఒకరు బస్సు ఎక్కగా సహ ప్రయాణికుడు మాస్క్‌ సరిగ్గా ధరించమని సూచించాడు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగి, ఇదికాస్తా గొడవకు దారి తీసిందట.

బెల్జియం నివాసి అయిన రాబర్ట్‌ మర్ఫీ బస్సులో ప్రయాణిస్తుండగా, వెనుకనున్న వ్యక్తి ముక్కు చీదడం వినిపించిందట. వెంటనే మర్ఫీ అతడి దగ్గరికెళ్లి వారించగా, అతడు క్షమాపణ కోరాడు. కొద్దిసేపటికే ఓ జంట బస్సు ఎక్కింది. వారు మర్ఫీ ఎదుట కూర్చున్నారు. అందులో యువకుడు మాస్క్‌ సరిగా ధరించకపోవడంతో మర్ఫీ అతడిని కూడా వారించాడు. దీంతో వారి మధ్య గొడవ జరిగింది. సదరు వ్యక్తి అకస్మాత్తుగా మర్పీపై దాడికి దిగాడు. మర్ఫీ చాతిపై దంతాల అచ్చు పడేలా కొరికి, తన ప్రేయసితో కలిసి బస్సు దిగి పారిపోయాడు. వెంటనే మర్పీని స్థానిక దవాఖానలో చేర్పించి, చికిత్స అందించారు. కాగా, పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా ఆ జంటను గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారని ఓ స్థానిక మీడియా వెల్లడించింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo