శుక్రవారం 04 డిసెంబర్ 2020
International - Oct 20, 2020 , 22:43:03

ఏమీ చేయకుండానే ఇతడి వీడియోలకు మిలియన్‌ వ్యూస్‌..!అదెలా అంటే?

ఏమీ చేయకుండానే ఇతడి వీడియోలకు మిలియన్‌ వ్యూస్‌..!అదెలా అంటే?

హైదరాబాద్‌: టిక్‌టాక్‌లో మిలియన్‌ ఫాలోవర్స్‌ కావాలంటే ఏదో ఒకటి చేయాలి. అంటే డ్యాన్స్‌, పర్‌ఫార్మెన్స్‌ ఇలా ఏదైనా ఉంటేనే మన వీడియోలు చూస్తారు. కానీ, ఓ వ్యక్తి ఏమి చేయకుండానే మిలియన్‌ వ్యూస్‌ పొందుతున్నాడు. అతడు ఏం చేస్తున్నాడో తెలిస్తే మీరు షాకవుతారు. అతను చేస్తుందల్లా కెమెరాను కన్నార్పకుండా తదేకంగా చూడడమే.

వియత్నాంకు చెందిన అన్‌ట్రాన్‌టాన్‌ కెమెరా వైపు తదేకంగా చూస్తాడు. అసలు కన్ను కూడా ఆర్పడు. దీంతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇందులో జనాలకు ఏం నచ్చిందో తెలియదుగానీ ఈ వీడియోలకు మిలియన్‌ వ్యూస్‌ వస్తున్నాయి. అతడి ఒక వీడియోకైతే  20.8 మిలియన్ (2.08 కోట్లు) వ్యూస్‌ వచ్చాయట.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.