సోమవారం 03 ఆగస్టు 2020
International - Jul 15, 2020 , 14:27:58

నకిలీ కరోనా ధృవపత్రాల జారీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

నకిలీ కరోనా ధృవపత్రాల జారీ కేసులో వ్యక్తి అరెస్ట్‌

ఢాకా : వేలాది నకిలీ కరోనా ధృవపత్రాలను జారీ చేసిన దవాఖాన యజమానిని బంగ్లాదేశ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌ సరిహద్దు ప్రాంతంలోని సత్ఖిరాకు చెందిన మొహమ్మద్ షాహేద్‌ ప్రైవేట్ రీజెంట్ హాస్పిటల్ చైర్మన్. అతని దవాఖానలో కరోనాకు సంబంధించి నకిలీ ధృవపత్రాల జారీ విషయంలో అతడిని అరెస్టు చేశారు. నకిలీ ధృవపత్రాలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడే షాహేద్‌ బుర్ఖాలో భారత్‌కు పారిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. 

కరోనా నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసిన కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తరువాత మిగతా దవాఖానల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. అంతకుముందు ఇదే విషయమై మరో వైద్యుడిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు బంగ్లా పోలీసులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo