బుధవారం 27 మే 2020
International - May 18, 2020 , 17:47:15

దేశాధ్యక్షుడి వీడియో సమీక్షలో నగ్నంగా..

దేశాధ్యక్షుడి వీడియో సమీక్షలో నగ్నంగా..


బ్రసీలియా: లాక్‌డౌన్‌ కారణంగా చాలా కార్యాలయాలు వర్క్‌ ఫ్రమ్‌ అవకాశం కల్పించాయి. అధికారులు, దేశాధినేతలు వీడియో సమీక్షల ద్వారా కింది స్థాయి వారికి ఆదేశాలు జారీచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో కొన్ని గమ్మత్తు సంఘటనలు జరుగుతాయి. అలాంటి చేదు అనుభవమే బ్రెజిల్‌ దేశాధ్యక్షుడికి ఎదురైంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకొంటున్న చర్యలపై బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు చర్చిస్తున్న సమయంలో ఓ వ్యక్తి స్నానం చేస్తూ కనిపించడంతో అర్ధాంతరంగా  సమీక్షను ముగించాల్సి వచ్చింది. పది నిమిషాల పాటు ఆ వ్యక్తి అలాగే స్నానం చేస్తూ ఉన్నాడే కానీ దేశాధ్యక్షుడి వీడియో కాన్ఫరెన్స్‌ను మాత్రం పట్టించుకోలేదు. 

అసలింతకు ఏమి జరిగిందంటే.. బ్రెజిల్‌ దేశాధ్యక్షుడు జైర్‌ బోల్సొనారో సోమవారం పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలతో లాక్‌డౌన్‌ విధింపు తదనంతర చర్యలపై జూమ్‌ యాప్‌లో సమీక్ష జరిపారు. పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడు పాలో స్కాఫ్‌ మాట్లాడుతుండగా.. అధ్యక్షుడు జైర్‌ ఆయన స్పీచ్‌కు అడ్డుతగిలి.. పాలో.. ఆ చివరన ఉన్న ఉద్యోగి వెళ్లిపోయాడా? ఏదో కాస్తా ఇబ్బందికరంగా కనిపిస్తుంది.. అని చెప్పారు. దాంతో పరిశ్రమల మంత్రి పాలో గ్యూడ్స్‌ అందుకొని.. ఆ వ్యక్తి నగ్నంగా స్నానం చేస్తున్నాడు. సమీక్ష వాడిగా వేడిగా జరుగుతున్నందున శరీరాన్ని చల్లబర్చుకొనేందుకు అలా చేస్తున్నాడేమో? అని చమత్కరించాడు. దాంతో సమీక్షలో నవ్వులు వెల్లివిరిసాయి. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 


logo