బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Aug 07, 2020 , 18:58:26

భార్య క‌ళ్లే పిల్ల‌ల‌కు జీన్స్‌గా వ‌చ్చాయి.. ఆనందించాల్సింది పోయి వ‌దిలేశాడు!

భార్య క‌ళ్లే పిల్ల‌ల‌కు జీన్స్‌గా వ‌చ్చాయి.. ఆనందించాల్సింది పోయి వ‌దిలేశాడు!

త‌ల్లిదండ్రుల పోలిక‌లు కొన్ని పిల్ల‌ల‌కు వ‌స్తే చాలా ఆనంద‌ప‌డ‌తారు. కానీ ఈ తండ్రి మాత్రం భార్యాబిడ్డ‌ల‌ను వ‌దిలేసి వెళ్లిపోయాడు. ఆమెలో న‌చ్చిన క‌ళ్లే ఇప్పుడు పిల్ల‌ల‌కు వ‌చ్చాయ‌ని గిట్ట‌క వ‌దిలేశాడు. ఇంత‌కీ వీరి క‌ళ్లు ఎలా ఉంటాయంటే.. నీలి రంగు గాజు క‌ళ్లు. ఇలాంటి క‌ళ్లు కోసం ప్ర‌ముఖ హీరోయిన్లు పెద్ద‌వాళ్లంద‌రూ లెన్స్ వాడుతుంటారు. కానీ వీరు మాత్రం ఇదొక లోపంగా భావిస్తారు.  నైజీరియాలోని ఇలోరిన్‌లో నివసిస్తున్న వారు దీన్నొక వ్యాధిలా భావిస్తారు. అక్క‌డ నివ‌సించే రిసికాత్ అజీజ్ అనే మ‌హిళ‌ల‌కు చిన్న త‌నం నుంచే క‌ళ్లు నీలిరంగులో ఉండేవి. అయితే దీనివ‌ల్ల ఎలాంటి ఆనారోగ్యం క‌లుగ‌లేద‌ని చెబుతున్న‌ది.

ఈ నీలిరంగు క‌ళ్లు చూసి ఒక అత‌ను ప్రేమించి పెండ్లి చేసుకున్నాడు. కొన్నిరోజుల త‌ర్వాత గ‌ర్భందాల్చిన రిసికాత్‌కు క‌వ‌ల‌లు పుట్టారు. అయితే వీరికి అచ్చం ఆమె క‌ళ్లే వ‌చ్చాయి. దీంతో అత‌డికి న‌చ్చ‌క ఇంటికి స‌రిగా వ‌చ్చేవాడు కాదు. పిల్ల‌ల్ని ప‌ట్టించుకునేవాడు కాదు. స‌రైన తిండి లేక క‌వ‌ల‌లో ఒక పిల్ల చ‌నిపోయింది. త‌ర్వాత అయినా అత‌డిలో మార్పు రాలేదు. అస‌లు ఇంటికి రావ‌డ‌మే మానేశాడు. ఎక్క‌డున్నాడో తెలియ‌దు. ఎప్ప‌టికైనా వ‌స్తాడ‌మే న‌మ్మ‌కంతో ఎదురుచూస్తున్న‌ది. రెండో బిడ్డ‌కు త‌న క‌ళ్లే వ‌చ్చిన‌ప్ప‌టికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నార‌ని వైద్యులు వెల్ల‌డించారు. నీలి రంగు కళ్లపై పరిశోధకులు మాట్లాడుతూ.. ఇది అరుదైన జెనిటిక్ ఐస్ సిండ్రోమ్ అని తెలిపారు. ప్రపంచంలో 40 వేల మందిలో ఒకరికి ఈ సమస్య ఉంటుందన్నారు. దీని కోసం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది. 


  

 


logo