గురువారం 24 సెప్టెంబర్ 2020
International - Aug 19, 2020 , 08:00:25

మాలీలో సైనికుల తిరుగుబాటు.. దేశాధ్యక్షుడి రాజీనామా

మాలీలో సైనికుల తిరుగుబాటు.. దేశాధ్యక్షుడి రాజీనామా

బొమాకో: సైనికుల తిరుగుబాటుతో మాలి దేశ అధ్యక్షుడు ఇబ్రహీం బౌబాకర్ కీతా బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో గ‌తకొత‌కాలంగా ఆందోళనలు కొన‌సాగుతున్నాయి. దీంతో మాలిలో రక్తం పారవద్దని తాను అధ్య‌క్ష‌పదవికి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. త‌న రాజీనామా వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని జాతీయ టీవీలో ప్రకటించారు. ఆయ‌న ప‌ద‌వీకాలం ఇంకా మూడేండ్ల‌పాటు ఉన్న‌ది.  


దేశంలో తిరుగుబాటు చేసిన సైనికులు అధ్యక్షుడు ఇబ్ర‌హీంను అదుపులోకి తీసుకున్నారు. అంత‌కుముందు విజ‌య సూచ‌కంగా అతని ఇంటి బయట గాలిలోకి కాల్పులు జరిపారు. రాజ‌ధాని న‌గ‌రం బొమాకోను త‌మ ఆధీనంలోకి తీస‌కున్నారు. అధ్య‌క్షుడితోపాటు ప్ర‌ధాని బౌబౌ సిస్సేను మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం నిర్బంధించారు. తిరుగుబాటు సైనికుల‌తోపాటు, ప్ర‌జ‌లు కూడా భారీగా ‌రోడ్ల‌పైకి వ‌చ్చారు.  


logo