శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 28, 2020 , 12:26:15

తిరుగుబాటుదారుల చెరవీడిన మాలీ అధ్య‌క్షుడు

తిరుగుబాటుదారుల చెరవీడిన మాలీ అధ్య‌క్షుడు

బ‌మాకో: మాలీ అధ్య‌క్షుడు ఇబ్ర‌హిం బౌబాక‌ర్ కీటా తిరుగుబాటు సైన్యం చెర నుంచి వీముక్తి పొందారు. ప‌దిరోజుల క్రితం (ఆగ‌స్టు 18న‌) రాజ‌ధాని బ‌మాకోలోని అధ్య‌క్ష భ‌వ‌నాన్ని తిరుగుబాటు సైనికులు త‌మ ఆదీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడు కీటాను, మ‌రికొంత‌ మంది అధికారుల‌ను కిడ్నాప్ చేశారు.  అనంత‌రం కీటా త‌న అధ్య‌క్ష‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. అదేవిధంగా పార్ల‌మెంటును ర‌ద్దుచేశారు. దీంతో తిరుగుబాటుదారుల నేతృత్వంలో నేష‌న‌ల్ క‌మిటీ ఫ‌ర్ ద సాల్వేష‌న్ ఆఫ్ ద పీపుల్ (సీఎన్ఎస్పీ) పేరుతో కొత్త పాల‌క‌మండ‌లిని ఏర్పాట‌య్యింది. ‌

సైనికుల చెర నుంచి విముక్తి పొందిన కీటా గురువారం తెల్ల‌వారుజామున సెబెనికోరోలోని త‌న ఇంటికి చేరుకున్నారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ తాత్కాలికంగా తాను మాలి వ‌దిలి వెళ్తున్నాన‌ని, కొంత‌కాలంపాటు యూఏఈలోని అబుదాబీలో ఉంటాన‌ని తెలిపారు.  


logo