శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 15:39:40

క్వారెంటైన్‌లో మ‌లేషియా రాజ దంప‌తులు..

క్వారెంటైన్‌లో మ‌లేషియా రాజ దంప‌తులు..


హైద‌రాబాద్‌: మ‌లేషియా రాజ దంప‌తులు క్వారెంటైన్‌లో ఉన్నారు. రాజ‌సౌధానికి చెందిన ఏడుగురు ఉద్యోగుల‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో రాజు, రాణి ఇద్ద‌రూ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దిన్‌, ఆయ‌న స‌తీమ‌ణి త‌న‌కు అజిహ అమినా మైమునా ఇస్కంద‌రియాలు .. రాజ భ‌వ‌నంలోనే వేరు వేరుగా జీవిస్తున్నారు.  వారిద్ద‌రికీ వైర‌స్ నెగ‌టివ్ అని తేలినా.. జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు.  14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల‌ని ఆ ఇద్ద‌రూ నిర్ణ‌యించారు. క‌రోనా వైర‌స్ సోకిన ఏడుగురి ఉద్యోగుల ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్న‌ది. ద‌క్షిణాసియాలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అయ్యింది మ‌లేషియాలోనే. ఆ దేశంలో 21 మంది మృతిచెందారు. 1796 మందికి క‌రోనా సోకింది. logo