శుక్రవారం 05 జూన్ 2020
International - May 13, 2020 , 18:22:31

చిన్న వ‌య‌సు.. పెద్ద బాధ్య‌త‌!

చిన్న వ‌య‌సు.. పెద్ద బాధ్య‌త‌!

క‌రోనా కాలంలో అంద‌రికంటే డేంజ‌ర్‌లో ఉన్నది వైద్య సిబ్బందే. వాళ్ల‌ని ఇంట్లో ఉండ‌మ‌ని చెప్ప‌లేం. కాబ‌ట్టి, వారిని సంర‌క్షించే పీపీఈ కిట్ల‌ను అందివ్వాల‌నుకున్న‌ది 9 ఏండ్ల నూర్ అపియా. కుట్టుమిష‌న్ మీద కూర్చుంటే క‌నీసం కాళ్లు కూడా అంద‌ని ఈ పాప కష్టానికి స‌లాం కొట్టాల్సిందే. 

డాక్ట‌ర్ల‌ ప్రాణాలు కాపాడాల‌నే ఆలోచ‌న‌ను త‌ల్లికి చేర‌వేసింది.  త‌ల్లి స్ఫూర్తితో 5 ఏండ్లకే కుట్ట‌డం నేర్చుకున్న నూర్ పొడ‌వైన పీపీఈ కిట్ల‌ను కుట్టింది. వాటిని ద‌గ్గ‌ర్లో ఉన్న హాస్పిట‌ల్ సిబ్బందికి అంద‌జేస్తున్న‌ది. మార్చి నుంచి కుట్ట‌డం మొద‌లుపెట్టిన ఈ ప్ర‌య‌త్నంలో ఇప్ప‌టివ‌ర‌కు 130 గౌన్లు కుట్టింది. రోజుకు నాలుగు గౌన్లు తయారు చేస్తున్నది. మ‌రో 60 కిట్లు అందించడానికి రెడీగా ఉంది. అస‌లే రంజాన్ నెల న‌డుస్తుంది. ఒక‌వైపు ఉప‌వాశం ఉంటూనే ఈ ప‌ని చేస్తుంది. 


logo