మంగళవారం 31 మార్చి 2020
International - Feb 25, 2020 , 02:51:58

ప్రధాని పదవికి మహతిర్‌ రాజీనామా

ప్రధాని పదవికి మహతిర్‌ రాజీనామా
  • మలేషియాలో రాజకీయ సంక్షోభం

కౌలాలంపూర్‌: మలేషియా ప్రధాని మహతిర్‌ మొహమ్మద్‌ (94) సోమవారం తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ దేశ రాజుకు పంపారు. అధికార కూటమిలోని మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నించడం, కూటమిలో మరో కీలక నేత అన్వర్‌ ఇబ్రహీంకు పగ్గాలు అప్పగించ డంపై ప్రతిష్ఠంభన నెలకొన్న నేపథ్యంలో మహతిర్‌ రాజీనామా చేయడం మలేషియా లో రాజకీయ సంక్షోభానికి దారితీసింది. పాలక పక్షంలోని అన్వర్‌ వ్యతిరేక వర్గం, పలువురు విపక్ష కూటమి నేతలు ఆదివారం వరుస భేటీలు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. దీంతో నూతన కూట మి ఏర్పాటుకానుందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అన్వర్‌ ప్రధాని కాకుండా అడ్డుకునేందుకే ఈ కూటమి ఏర్పాటవుతున్నదని వార్తలొస్తున్నాయి. ప్రతిపాదిత కొత్త కూటమిలో.. అబ్దుల్‌ రజాక్‌కు చెందిన ‘యునైటెడ్‌ మలేషియా నేషనల్‌ ఆర్గనైజేషన్‌'ను చేర్చుకోనున్నట్లు సమాచారం. రెండేం డ్ల కిందట రజాక్‌ ప్రధాని పదవిని కోల్పోయారు. అవినీతిలో కూరుకున్న ప్రభుత్వా న్ని గద్దె దించేందుకు మహతిర్‌, అన్వర్‌ తమ విభేదాలను పక్కనపెట్టి 2018 ఎన్నికల్లో పోటీచేశారు. మహతిర్‌ రాజీనామా తర్వాత, ఆయన పార్టీ ‘బెర్సతు’ అధికార కూటమి నుంచి వైదొలిగింది. కాగా, కశ్మీర్‌పై పాక్‌ను సమర్థించడం, సీఏఏపై భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడడంతో మహతిర్‌పై భారత వ్యతిరేక ముద్రపడింది. logo
>>>>>>