శనివారం 04 ఏప్రిల్ 2020
International - Mar 02, 2020 , 00:31:17

మలేషియా కొత్త ప్రధాని ముహియుద్దిన్‌

మలేషియా కొత్త ప్రధాని ముహియుద్దిన్‌

కౌలాలంపూర్‌: మలేషియా ఎనిమిదవ ప్రధానిగా ముహియుద్దిన్‌ యాసిన్‌ (72) ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. కౌలాలంపూర్‌లోని రాజసౌధంలో రాజు సుల్తాన్‌ అబ్దుల్లా సుల్తాన్‌ అహ్మద్‌ షా సమక్షంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ దేశ  ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, అవినీతి కుంభకోణంతో ప్రమేయమున్న యూఎంఎన్‌వో కూటమి తిరిగి అధికారంలోకి రావడంపై మలేషియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రధాని పదవికి రాజీనామా చేసి రాజకీయ సంక్షోభానికి కారణమైన మహతీర్‌ మహ్మద్‌, పార్లమెంట్‌లో బలనిరూపణ కోరతానని, ముహియుద్దిన్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానన్నారు.
logo