శనివారం 30 మే 2020
International - Apr 11, 2020 , 11:34:15

మలేషియాలో మరోమారు లాక్‌డౌన్‌ పొడిగింపు

మలేషియాలో మరోమారు లాక్‌డౌన్‌ పొడిగింపు

కౌలాలంపూర్‌: మలేషియాలో లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్‌డౌన్‌ను ఏప్రిల్‌ 15 నుంచి 28 వరకు పొడిగిస్తున్నామని ఆ దేశ ప్రధాని ముహియుద్దిన్‌ యాసిన్‌ ప్రకటించారు. కరోనా వైరస్‌ దేశంలో వ్యాప్తి చెందకుండా మార్చి 18న రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 14 వరకు మళ్లీ పొడిగించింది. వైద్యరంగ నిపుణులు, ఆరోగ్య మంత్రిత్వశాఖ విజ్ఞప్తితో మరోమారు రెండు వారాలపాటు లాక్‌డౌన్‌ను విధించింది. అందువల్ల నిత్యావసరాలకు మినహాయించి ప్రజలు తమ ఇండ్ల నుంచి ఎవ్వరూ బయటకు రాకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.


logo