మాస్కో, సెప్టెంబర్ 19: రష్యా పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్ నేతృత్వం వహిస్తున్న యునైటెడ్ రష్యా పార్టీ మళ్లీ గెలిచింది. పార్లమెంటులో అవసరమైన సంఖ్యా బలాన్ని సాధించింది. అయితే దీనిని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. రష్యా పార్లమెంటు ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఆదివారం ముగిశాయి. ఈ ఎన్నికల్లో యునైటెడ్ రష్యా సహా 13 పార్టీలు బరిలో ఉన్నాయి. కీలక ప్రతిపక్ష నావల్నీ అరెస్టు, ఆయన మద్దతు దారులపై వేధింపులు, ప్రతిపక్షాల అణచివేతపై పుతిన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.