బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 10:08:29

క‌రోనా స‌మ‌యంలో.. హెల్తీ లైఫ్‌స్ట‌యిల్ ఇలా

క‌రోనా స‌మ‌యంలో.. హెల్తీ లైఫ్‌స్ట‌యిల్ ఇలా

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న‌ది.  అన్ని దేశాలు దాదాపు లాక్‌డౌన్ ప్ర‌క‌టించాయి.  ప్ర‌పంచంలో స‌గం జ‌నం.. ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. మ‌రి ఇలాంటి సంద‌ర్భంలో.. హెల్త్ లైఫ్‌స్ట‌యిల్‌ను ఎలా మెయిటేన్ చేయాలి.  ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌డ‌మే ఇప్పుడు అతిపెద్ద స‌మ‌స్య‌.  అయితే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కొన్ని సూత్రాలు చెప్పింది.  మ‌హ‌మ్మారి ప్ర‌బ‌లుతున్న‌ స‌మ‌యంలో ఇలాంటి నియ‌మాలు పాటించాల‌ని సూచించింది.  

ఆరోగ్యంగా ఉండాల‌నుకుంటే.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని స్వీక‌రించాలి.  డ‌బ్ల్యూహెచ్‌వో త‌న ట్విట్ట‌ర్‌లో ఈ సూత్రాన్ని చెప్పింది.  క్యారెట్ లాంటి తాజా కూర‌గాయ‌లు తీసుకోవాల‌న్న‌ది.  ఫిజిక‌ల్‌గా ఫిట్‌గా ఉండ‌డం కూడా కీల‌కం. దీని కోసం ర‌న్నింగ్‌, జాగింగ్ లాంటివి చేయాలి. అప్పుడే శ‌రీరం దృఢంగా ఉంటుంది.  ఇక ధూమ‌పానం చేసేవాళ్లు వెంట‌నే అది మానివేయాలి. స్మోకింగ్‌తో కోవిడ్‌19 తొంద‌ర‌గా సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.  మ‌ద్యాన్ని కూడా దూరం పెట్టాల‌ని సూచించింది. ఈ స‌మ‌యంలో బీర్, వైన్ లాంటివి ప‌క్క‌న‌పెట్టాలి. ఇక కావాల్సినంత నిద్ర పోవాలి. కంటినిండ నిద్ర కూడా అవ‌స‌ర‌మ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది. logo
>>>>>>