శనివారం 04 జూలై 2020
International - Jun 07, 2020 , 22:36:45

సీఎం అండగా ఉంటారు.. అధైర్యపడొద్దు

సీఎం అండగా ఉంటారు.. అధైర్యపడొద్దు

సౌతాఫ్రికా : అన్నిదేశాల టీఆర్‌ఎస్‌ ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ అండగా ఉంటారని ఎన్నారై శాఖల కోఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాల అన్నారు. ఆదివారం వీడియోకాన్ఫరెన్స్‌లో అన్నిదేశాల ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. కరోనాతో పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. ఎవ్వరూ అధైర్యపడొద్దని భరోసా నింపారు. అందరికీ రాష్ట్ర అవతరణ దినం శుభాకాంక్షలు తెలిపారు. అన్ని దేశాల ప్రతినిధులుతో ఇలా ఒకేసారి మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. పార్టీ ఎన్నారై కోఆర్డినేటర్‌గా సీఎం కేసీఆర్‌ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లాక్‌డౌన్‌ సమయంలో విదేశాల్లోని తెలంగాణ విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని గుర్తు చేశారు. అనంతరం వారందరూ అమరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. యూఎస్‌ఐ, గల్ఫ్‌, యూకే, సౌతాఫ్రికా, మలావి, కాంగో తదితర దేశాల్లో చిక్కుకుపోయిన వారికి మందులు అందించేందుకు సాయం అందించిన మహేశ్‌ బిగాలకు  కృతజ్ఞతలు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ యూఎస్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్మన్‌ మహేశ్‌ తన్నీరు తదితరులు పాల్గొన్నారు. logo