సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 22, 2020 , 21:43:54

రూ.2.5 కోట్లు పలికిన మహాత్ముడి కళ్లజోడు

రూ.2.5 కోట్లు పలికిన మహాత్ముడి కళ్లజోడు

యూకే : భార‌త జాతిపిత మహాత్మాగాంధీ కళ్లజోడును ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేసింది. ఇందులో కళ్లద్దాలు భారీ ధర పలికాయి. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను బ్రిస్టల్‌లో వేలానికి పెట్టగా ఇవి 2,60,000 యూరోల‌కు అమ్ముడుపోవడం విశేషం. అంటే భార‌త క‌రెన్సీలు సుమారు రూ. 2.5 కోట్లు. ఈ అద్దాలను అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని వ్యక్తి దక్కించుకున్నాడు. వీటిని వేలంలో తొలుత 15,000 యూరోల ధరకే రిజర్వ్ చేశామని ఆక్షనర్ ఆండీ స్టోవ్ తెలిపారు. కాగా, భార‌త్ స‌హా చాలా దేశాల నుంచి ప్రజలు ఈ అద్దాలను కొనుగోలు చేయ‌డానికి ఆస‌క్తి చూప‌డంతో ధర ఒక్కసారిగా పెరిగింది. గతంలో సౌతాఫ్రికాలో గాంధీజీ ఉన్నప్పుడు 1920లో బ్రిటిష్‌ పెట్రోలియంలో పని చేసే వ్యక్తికి ఇచ్చారని సంస్థ తెలిపింది. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్‌కు పంపాడు. ఇవి పనికి రావని, విసిరి పారేయాల‌ని భావించాడ‌ట‌.. కానీ, ఇప్పుడు వీటితోనే అతడు తన జీవితాన్ని మార్చేంత డబ్బులను దక్కించుకున్నాడని, ధరను చూసి ఆశ్చర్యపోతాడని స్టోవ్‌ పేర్కొన్నారు. కాగా, భారత్‌, ఖతార్‌, అమెరికా, రష్యా, కెనడా నుంచి బిడ్లు వచ్చాయని సదరు సంస్థ తెలిపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo