రిషికేశ్: తాగిన మైకంలో మహిళతో అసభ్యంగా ప్రవర్తించి ఓ ఎస్సై ఉద్యోగం పోగొట్టుకున్నాడు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రిషికేశ్‌లోని ఐఎస్బీటీ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న వినయ్ శర్మ.. గత ఆదివారం తమ మాజీ ఇంటి యజమానురాలు ఇంటికి వెళ్లాడు.
అక్కడ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో దూషించాడు. దాంతో ఆగ్రహించిన మహిళ సోమవారం ఆ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది. దాంతో డీజీపీ అప్పటికప్పుడే ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీచేశారు. అనంతరం ఘటనపై విచారణకు ఆదేశించారు.