బుధవారం 08 ఏప్రిల్ 2020
International - Jan 10, 2020 , 14:46:14

మేడ‌మ్ టుస్సాడ్స్ నుంచి ప్రిన్స్ హ్యారీ ఔట్‌

మేడ‌మ్ టుస్సాడ్స్ నుంచి ప్రిన్స్ హ్యారీ ఔట్‌

హైద‌రాబాద్‌: రాయ‌ల్ లైఫ్ వ‌ద్దు అనుకున్న ప్రిన్స్ హ్యారీ, మేఘ‌న్‌ల‌కు ఓ జ‌ల‌క్ త‌గిలింది. మేడ‌మ్ టుస్సాడ్స్‌లో ఉన్న రాచ దంప‌తుల మైన‌పు విగ్ర‌హాల‌ను తొల‌గించారు. రాజ‌కుంటుంబం నుంచి వేరుప‌డి బ్ర‌తుకుదామ‌నుకుంటున్న‌ట్లు ప్రిన్స్ హ్యారీ దంపతులు ప్ర‌క‌టించిన మ‌రుస‌టి రోజే టుస్సాడ్స్ నుంచి వారి మైన‌పు బొమ్మ‌ల‌ను తొల‌గించేశారు. వాస్త‌వానికి ఆ బొమ్మ‌లు.. రాయ‌ల్ ఫ్యామిలీతో క‌లిసి ఉండేవి. ఇప్పుడు ఆ మైన‌పు బొమ్మ‌ల‌ను మ‌రో చోటుకు త‌ర‌లిస్తారు. లండ‌న్‌లోని టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో సుమారు 250 మంది సెల‌బ్రిటీల మైన‌పు బొమ్మ‌లు ఉన్నాయి.

ఇకపై బ్రిటన్‌తోపాటు అమెరికాలోనూ నివసిస్తామని ప్రిన్స్ హ్యారీ చెప్పారు. అయితే తమ ఏడాది వయసున్న కుమారుడు ఆర్చీని మాత్రం రాజకుటుంబ సంప్రదాయాల ప్రకారమే పెంచనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రకటనతో రాణి ఎలిజబెత్‌-2 తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్టు సమాచారం. ఆమెను సంప్రదించకుండానే ప్రిన్స్‌ హ్యారీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.


logo