బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 04, 2020 , 04:10:02

‌ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా క్యాస్టెక్స్‌

‌ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా క్యాస్టెక్స్‌

పారిస్‌: ఫ్రాన్స్‌ నూతన ప్రధానిగా జాన్‌ క్యాస్టెక్స్‌ను ఆ దేశ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మాక్రన్‌ శుక్రవారం నియమించారు. ఇప్పటివరకు ప్రధానిగా ఉన్న ఫిలిప్పే స్థానంలో క్యాస్టెక్స్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. లాక్‌డౌన్‌ అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టే లక్ష్యంతో మాక్రన్‌ తన ప్రభుత్వాన్ని పునర్‌వ్యవస్థీకరిస్తున్నారు. కరోనానంతరం దశలవారీగా దేశాన్ని ‘రీఓపెన్‌' చేయడంలో క్యాస్టెక్స్‌ కీలకంగా వ్యవహరించారు.


logo