సోమవారం 13 జూలై 2020
International - May 25, 2020 , 16:49:48

లింగ సమానత్వం కోసం గుప్తా డాటర్స్‌..

లింగ సమానత్వం కోసం గుప్తా డాటర్స్‌..

పురుషాధిక్యం ఉద్యోగాల్లోనే కాదు ఇంట్లో కూడా ఎక్కువగా ఉంటుంది. కొడుకుకు ఇచ్చే విలువ కూతుళ్లకు ఇవ్వడం లేదు తల్లిదండ్రులు. తాము చేసే వ్యాపారాలకు కొడుకు పేరు పెడుతూ వారినే ఓనర్లుగా ప్రకటిస్తున్నారు. బయట ఎక్కడ చూసినా వ్యాపార సంస్థలు, దుకాణాలకు  సన్స్‌, బ్రదర్స్‌ ఉన్న పేర్లనే చూశాం. కానీ, డాటర్స్‌ ఉన్న పేరుని ఎక్కడైనా చూశామా? ఇదే కదా పురుషాధిక్యం అని పంజాబ్‌లోని లుధియానాకు చెందిన మనోజ్‌ కుమార్‌ గుప్తా (54) అనే వ్యక్తి తన మెడికల్‌ షాపుకు ‘గుప్తా అండ్‌ డాటర్స్‌’ అనే పేరుతో రిజిస్టర్‌ చేయించాడు. 

మనోజ్‌ కుమార్‌ భవన నిర్మాణం కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఒక భవన నిర్మాణ రంగానికి ‘గుప్తా అండ్‌ సన్స్‌’ పేరుతో రిజిస్టర్‌ చేయించాడు. ఒక కొడుకు, ఒక కూతురు ఉన్న ఈయన లింగబేధం చూపకుండా మెడికల్‌ షాపుకు గుప్తా అండ్‌ డాటర్స్‌ అని పెట్టాడు. ఇప్పుడు ఈ దుకాణం బోర్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఈ విధంగా తనలోని అభ్యుదయ భావాన్ని చాటుకున్నాడు కుమార్‌. మనోజ్‌ కొడుకు పేరు రోషన్‌, కూతురు పేరు ఆకాంక్ష.


logo