సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 01, 2020 , 12:23:47

జ‌స్ట్ మిస్ : తాడు ఉందిలే అని వంతెన మీద ఎగురుతున్నాడు.. అది ఎప్పుడో ఊడిపోయింది!

జ‌స్ట్ మిస్ : తాడు ఉందిలే అని వంతెన మీద ఎగురుతున్నాడు.. అది ఎప్పుడో ఊడిపోయింది!

సాహ‌సం చేయ‌రా డింబ‌కా.. కొంద‌రికి సాహ‌సాలంటే భ‌లే పిచ్చి. ఆకాశంలో ఎగ‌రాల‌ని అంద‌రికీ కోరిక ఉంటుంది. ఆ క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డానికి కొంత‌మంది పారాచూట్ లేదంటే ఎత్తులో ఉండే వంతెన‌ల మీద నుంచి తాడు సాయంతో కింద‌కి విహ‌రిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఏ చిన్న పొర‌పాటు జ‌రిగినా అంతే ప్రాణాలు గాల్లో క‌లిసిపోతాయి. ఈ వీడియోలో ఉన్న చైనీస్ వ్య‌క్తి విష‌యంలో అలాంటి పొర‌పాటే జ‌రిగింది.

ఎత్తైన ప‌ర్వ‌తం మీద ఉన్న ఒక వంతెన‌పై సాహ‌సానికి సిద్ద‌మ‌య్యాడు. ఈ వంతెన నిచ్చెన మాదిరిగా ఉంటుంది. మ‌ధ్య మ‌ధ్య‌లో ఖాళీ ఉంటుంది. దీని మీద న‌డ‌వాల‌న్నా మ‌నిషి న‌డుముకి తాడు క‌ట్టాల్సిందే. అలానే ఇత‌నికి కూడా తాడు క‌ట్టారు. చెంగు చెంగుమంటూ అడుగులు వేసి కింద‌కి దూకుదామ‌నుకున్నాడు. అప్పుడే ఊడిన తాడుని ప‌సిగ‌ట్టిన అత‌ను అక్క‌డే ఆగిపోయాడు. ఇది గ‌నుక చూసుకోనుండ‌క‌పోతే ఇక అంతే.. ఎంతైనా అదృష్ట‌వంతుడు అని వీడియో చూసిన వారంతా అంటున్నారు. 
logo