శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 24, 2020 , 20:26:13

ప్రియురాలి కోసం గోడెక్కిచూస్తున్న కుక్క!వీడియో వైరల్‌

ప్రియురాలి కోసం గోడెక్కిచూస్తున్న కుక్క!వీడియో వైరల్‌

హైదరాబాద్‌: మీరు ఇప్పటిదాకా నచ్చిన యువతి కోసం గోడెక్కిచూసే యువకులనే చూసి ఉంటారు. కానీ ఓ కుక్కకూడా అచ్చం మనిషిలాగే తన ప్రియురాలికోసం వాల్‌పై నుంచి తొంగిచూస్తోంది. ఇదంతా గమనించిన దాని యజమాని వీడియో తీసి ఆ కుక్కకోసం కేటాయించిన ఇన్‌స్టాపేజీలోనే పోస్ట్‌ చేశాడు. ఈ వీడియో చూసినవారంతా ఓ మైగాడ్‌ అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందిన కుక్కపేరు హడ్సన్‌. ఇది మగ కుక్క. తన పక్కింటిలోని ఓ ఆడకుక్కపై మనసుపడింది. ఇంకేముంది ప్రతిరోజూ కాంపౌండ్‌వాల్‌ దగ్గరికి చేరి, దానిపైనుంచి తొంగి తొంగి చూస్తోందట తన ప్రియురాలిని. అలా చూసేటప్పుడు దాని మొఖం వెలిగిపోతున్నదట. పెదవులపై చిరునవ్వులు పూస్తున్నాయట. ఈ వీడియోను చాలామంది లైక్‌ చేశారు. పలువురు సో స్వీట్‌ అంటూ కామెంట్‌ పెట్టారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo