ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 09:42:36

హరికేన్‌ లారాతో లూసియానా అతలాకుతలం

హరికేన్‌ లారాతో లూసియానా అతలాకుతలం

హ్యూస్టన్‌ : ఇప్పటికే కరోనా మహమ్మారితో సతమతమవుతున్న అమెరికాలో హరికేన్‌ లారాతో భారీ విధ్వంసం చోటు చేసుకున్నది. లూసియానా-టెక్సాస్‌ సరిహద్దుల్లోని గల్ఫ్‌-కోస్ట్‌లో ఏర్పడిన హరికేన్‌ లారా గురువారం రాత్రి లూసియానాలోని కామెరాన్‌ సమీపాన తీరాన్ని తాకింది. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమాదాలు, ఘటనల్లో ఆరుగురు మరణించారు. గంటలకు 150 మైళ్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలులతో ఇండ్లు కూలిపోయాయి. చెట్లు విరిగి పడ్డాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి వేల కుటుంబాలు అంధకారంలో మగ్గుతున్నాయి. లూసియానాలో భారీ నష్టం వాటిల్లిందని అధికారులు చెప్పారు. నష్ట తీవ్రతను అంచనా వేసేందుకు అధ్యక్షుడు డొలాన్డ్‌ ట్రంప్ ఈ వారాంతంలో లూసియానా, టెక్సాస్‌లో పర్యటించనున్నారని, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు అదనపు అత్యవసర నిధులు సమకూర్చాలని ప్రభుత్వం వైట్ హౌస్‌ను కోరినట్లు గవర్నర్‌ జాన్ బెల్ ఎడ్వర్డ్స్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo