బుధవారం 27 మే 2020
International - May 18, 2020 , 18:05:22

వాసనశక్తి తగ్గితే జాగ్రత్త.. బ్రిటన్ హెచ్చరిక

వాసనశక్తి తగ్గితే జాగ్రత్త.. బ్రిటన్ హెచ్చరిక

లండన్: వాసనలు పసిగట్టే, రుచిని చూసే శక్తి తగ్గిపోయినవారు జాగ్రత్తలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ప్రజలకు జారీచేసిన కరోనా మార్గదర్శకాలను సవరించింది. దగ్గు, జ్వరంతో పాటుగా వాసన తగ్గిపోవడాన్ని కరోనా లక్షణంగా అధికారిక జాబితాలో చేర్చారు. ఈ విషయం ప్రజలకు ఎప్పుడో చెప్పాల్సిందని, అలా చేయని  కారణంగా ఈసరికే ఎన్నో కరోనా కేసులు లెక్కకురాకుండా పోయిఉంటాయని నిపుణులు అంటున్నారు. వైద్య పరిభాషలో వాసన శక్తి తగ్గిపోవడాన్ని అనోస్మియా అంటారు. ఎడతెరిపిలేని దగ్గు, అధిక జ్వరంతో పాటుగా ఇది కరోనాకు మూడో లక్షణమని బ్రిటన్‌కు చెందిన నలుగురు ప్రముఖ వైద్యనిపుణులు స్పష్టం చేశారు. ఈ లక్షణం కనిపించగానే అందరికీ దూరంగా ఉండాలని, పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వ ప్రకటన తెలియజేసింది. 13 నుంచి 50 శాతం వరకు కరోనా బాధితులు వాసన శక్తి కోల్పోయినట్టు అధ్యయనాల్లో వెల్లడైంది. దీనివల్ల కరోనా కేసులు 2 శాతం పెరగవచ్చని ఓ వైద్య నిపుణుడు అన్నారు. అమెరికా వంటి కొన్ని దేశాలు ఇదివరకే అనోస్మియాను కరోనా జాబితాలో చేర్చారు.


logo