బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 08, 2020 , 02:10:40

ప్రాణం పోతున్నా.. హంతకులను పట్టించాడు!

ప్రాణం పోతున్నా..  హంతకులను పట్టించాడు!

చండీగఢ్‌: దుండగుల చేతుల్లో ప్రాణం పోతు న్నా కూడా ఓ పోలీసు కానిస్టేబుల్‌ తన విధులను మరువలేదు. హ ర్యానాకు చెందిన కానిస్టేబుల్‌ రవీందర్‌సింగ్‌(28), పోలీస్‌ అధికారి కప్తాన్‌సింగ్‌(43) గత మంగళవారం సోనిపేట్‌-జింద్‌ రోడ్డులో విధుల్లో ఉండగా.. అక్కడ రోడ్డు పక్కన కొంత మంది కారు పార్కు చేసి మద్యం తాగుతున్నారు. ఆ ప్రాంతంలో కర్ఫ్యూ అమల్లో ఉన్నది. దీంతో వారిని అక్కడ నుంచి వెళ్లవలసిందిగా పోలీసులు హెచ్చరించారు. కానీ ఆ దుండగులు పదునైన ఆయుధాలతో పోలీసుల మీదనే దాడి చేశారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.అయితే రవీందర్‌సింగ్‌ చనిపోయే ముందు దుండగుల వాహనం నంబరును అరచేతిపై రాసుకున్నాడు. పోస్టుమార్టం సమయంలో వైద్యులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాహనం నంబరు ఆధారంగా పోలీసులు  నిందితులను పట్టుకున్నారు.

తాజావార్తలు


logo