శనివారం 11 జూలై 2020
International - Jun 05, 2020 , 15:39:33

టెలిఫోన్‌ బూత్‌లు కాస్తా.. కాఫీ షాపులుగా మారె

టెలిఫోన్‌ బూత్‌లు కాస్తా.. కాఫీ షాపులుగా మారె

లండన్‌లో ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు టెలిఫోన్‌ బాక్సులు లాక్‌డౌన్‌  తర్వాత కాఫీషాపులుగా మారుతూ కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా టెలిఫోన్‌ బూత్‌ మూతబడింది. సరిగ్గా లాక్‌డౌన్‌ ఎత్తేసే వారంరోజుల ముందు టెలిఫోన్‌ బాక్స్‌లను కాఫీ షాపులుగా మార్చి వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నారు దంపతులు లోరినిస్ హెర్నాండెజ్, సీన్ రాఫెర్టీ.

లాక్‌డౌన్‌లో టెలిఫోన్‌ బూత్‌ 6 వారాలుగా మూతబడి ఉంది. ఇలానే కొనసాగితే ఉపాధి పోతుందని ఈ నిర్ణయానికి వచ్చారు దంపతులు. దీనికి అమర్‌ కేఫ్‌గా నామకరణం చేశారు. అయితే ఈ కేఫ్‌లో స్పెషల్‌ కాఫీ అని కొలంబియాకు చెందిన హెర్నాండేజ్‌ చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌కు ముందు బాక్సుల తయారీకి అవసరమయ్యే ఖర్చంతా భరించారు. ఇప్పుడు దీనిని కేఫ్‌గా మార్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. అంతేకాదు ఈ బాక్సును ఎక్కడికైనా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. జనాలు ఎక్కువగా ఉండే ప్రదేశం పార్క్‌. కాబట్టి ఇంటి నుంచి ఎక్కడికైనా కేఫ్‌ మార్చుకునేలా రూపొందించారు. ప్రస్తుతం కొన్ని వారాలపాటు కేఫ్‌కు కావాల్సిన స్టాక్‌ అంతా ఉంది. దక్షిణ అమెరికా దేశంలో లాక్డౌన్ పరిమితులు భవిష్యత్తులో డెలివరీలను నిరోధించవని రాఫెర్టీ, హెర్నాండెజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


logo