శనివారం 28 మార్చి 2020
International - Jan 26, 2020 , 12:27:01

ఎన్నారై పాలసీ పట్ల సీఎం కేసీఆర్ చొరవ అభినందనీయం

ఎన్నారై పాలసీ పట్ల సీఎం కేసీఆర్ చొరవ అభినందనీయం

లండన్ : తెలంగాణ ఎన్నారైల సంక్షేమం కోసం త్వరలోనే 'ఎన్నారై పాలసీ' తీసుకువస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై ఎన్నారై సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని లండన్ ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నారై ల సంక్షేమం కోసం త్వరలోనే 'ఎన్నారై పాలసీ' తీసుకువస్తామని ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యంగా గల్ఫ్ లో నివసిస్తున్న ఎన్నారై బిడ్డల పట్ల కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధతో అలోచించి తానే స్వయంగా గల్ఫ్ దేశాలు పర్యటించి వారి సంక్షేమానికి కృషి చేస్తాననడం, ఎన్నారైల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తుందని అనిల్ తెలిపారు. 

ముఖ్యంగా ఎన్నారై పాలసీ కోసం గల్ఫ్ బిడ్డలంతా ఎదురుచూస్తున్నారని, ఎన్నో సందర్భాల్లో గల్ఫ్ టీఆర్ఎస్ నాయకులు జువ్వాడి శ్రీనివాస్ , సతీష్ కుమార్, శ్రీధర్ అబ్బగొని, అభిలాష తదితరులు తెలంగాణ నాయత్వాన్ని కలిసి పాలసీ ఏర్పాటుకు తమవంతు కృషి చేశారని అనిల్ గుర్తు చేశారు. దీనికి తోడు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన వారిలో నూతన హుత్సాహాన్ని నింపిందని తెలిపారు. ఎన్నారై పాలసీ కోసం ప్రత్యేక కృషి చేసిన మంత్రి కేటీఆర్, మాజీ ఎంపీ కవితకు అనిల్ కుర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు.

 


logo