సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 22:07:44

ఛారిటీ కోసం బుల్లి సైకిల్‌పై 370 కి.మీ. ప్రయాణం

ఛారిటీ కోసం బుల్లి సైకిల్‌పై 370 కి.మీ. ప్రయాణం

లండన్‌ : బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి దాతృత్వం కోసం బుల్లి సైకిల్‌పై 370 కిలీమీటర్లు ప్రయాణించి ఔరా అనిపించారు. 37 ఏళ్ల తండ్రి ఆయన కేవలం ఆరు రోజుల్లోనే ఈ మొత్తం దూరాన్ని పూర్తిచేయడం విశేషం. తన కుమార్తె యొక్క చిన్న పింక్ సైకిల్‌పై గ్లాస్గో నుంచి మాంచెస్టర్‌కు ప్రయాణించడం ద్వారా ఛారిటీ కోసం డబ్బును సేకరించి పలువురిచే ప్రశంసలు అందుకున్నారు.

వైథెన్‌షావ్‌కు చెందిన వెస్లీ హామ్నెట్ కేవలం ఆరు రోజుల్లో మొత్తం 370 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. అతను గ్లాస్గో నుంచి లేక్ డిస్ట్రిక్ట్ గుండా వెళ్లి సెప్టెంబర్ 21 వ తేదీన సాయంత్రం 6 గంటలకు దక్షిణ మాంచెస్టర్‌కు తిరిగి వెళ్ళగలిగాడు. తన సుదీర్ఘ సైకిల్ ప్రయాణాన్ని పూర్తి చేయడం ద్వారా వెస్లీ హామ్నెట్‌ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విరాళాల ద్వారా, 6,000 పౌండ్లు వసూలు చేశాడు. ఈ మొత్తం డబ్బును వైథెన్‌షావ్‌లోని స్వచ్ఛంద సంస్థలకు, దవాఖానకు అందజేశారు. గత ఏడాది తన తాతను కోల్పోయిన తరువాత స్వచ్ఛంద సంస్థ కోసం డబ్బు సేకరించాలని నిర్ణయించుకున్నానని వెస్లీ హామ్నెట్‌ చెప్పాడు. తమ తండ్రి సాధించిన ఈ అరుదైన ఫీట్‌ పట్ల ఆయన కుటుంబం గర్వంగా ఫీలవుతున్నట్లు చెప్పింది.


logo