గబ్బిలాలున్న సైట్‌ను కూల్చిన బిల్డర్.. రూ.6 కోట్ల ఫైన్

లండన్: గబ్బిలాల సంతానోత్పత్తి స్థలాన్ని కూల్చిన ఒక బిల్డర్‌కు ఆరు లక్షల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.6 కోట్లు) జరిమానా విధించారు. బ్రిటన్‌లోని తూర్పు లండన్‌లో ఈ ఘటన జరిగింది. 2018 మార్చిలో బెల్వే హోమ్స్ అనే సంస్థ స్కాట్లాండ్ యార్డ్‌లోని గ్రీన్విచ్ ప్రాంతంలో నిర్మాణాల కోసం కొన్ని కట్టడాలను కూల్చివేసింది. అయితే ఆ స్థలంలో సోప్రానో పిపిస్ట్రెల్ జాతి గబ్బిలాలు ఉన్నట్లుగా 2017లో నమోదైంది. యూకేలోని అన్ని గబ్బిలాలు యూరోపియన్ ప్రొటెక్టెడ్ జాతుల (ఈపీఎస్) నిబంధనల పరిధిలోకి వస్తాయ. గబ్బిలాల జాతుల పరిరక్షణ, నివాస నిబంధనలు 2010 కింద పూర్తి రక్షణ పొందుతాయి. వాటిని ఉద్దేశపూర్వకంగా పట్టుకోవడం, గాయపరచడం లేదా చంపడం, సంతానోత్పత్తి ప్రదేశం లేదా విశ్రాంతి స్థలాన్ని దెబ్బతీయడం లేదా నాశనం చేయడం నేరం కిందకు వస్తాయి.
ఈ నేపథ్యంలో నిర్మాణ సంస్థ అక్కడ చేపట్టిన కూల్చివేతల వల్ల ఆ జాతి గబ్బిలాల సంతానోత్పత్తి ప్రదేశానికి నష్టం జరిగినట్లు గత ఏడాది నవంబర్‌లో కేసు నమోదైంది. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు తగిన ఆధారాలను కోర్టుకు సమర్పించారు. దీంతో బెల్వే హోమ్స్ తన తప్పును అంగీకరించడంతో రూ.6 కోట్ల జరిమానా విధించారు. కోర్టు ఖర్చుల కింద 30 వేల పౌండ్లు, గబ్బిలాల సంరక్షణ ట్రస్ట్‌కు 20 వేల పౌండ్లను చెల్లించేందుకు కూడా ఆ సంస్థ ఒప్పుకున్నది. కాగా, వన్యప్రాణులకు సంబంధించిన నేరం కేసుల్లో ఇంత భారీగా జరిమానా విధించడం ఇదే తొలిసారని తెలుస్తున్నది.
తాజావార్తలు
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్‌గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో
- కాంగ్రెస్ అధికారంలోలేదు.. భవిష్యత్‌లో రాదు
- మెరుగుపడుతున్న శశికళ ఆరోగ్యం..!
- ఓటు నమోదు చేసుకోండి : మంత్రి కేటీఆర్
- భారత్‌లో లాక్డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు
- మలయాళ రీమేక్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్