గురువారం 28 మే 2020
International - Apr 28, 2020 , 10:03:30

లాక్‌డౌన్ స‌డ‌లింపు.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంపీ

లాక్‌డౌన్ స‌డ‌లింపు.. రెస్టారెంట్‌కు వెళ్లిన ఎంపీ

హైద‌రాబాద్‌:  నేటి నుంచి న్యూజిలాండ్‌లో లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డ‌లిస్తున్నారు.  కోవిడ్‌19 క‌మ్యూనిటీ ట్రాన్స్‌మిష‌న్ లేద‌ని, అందుకే ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు సోమ‌వార‌మే ప్ర‌ధాని జెసిండా ఆర్డెన్ ప్ర‌క‌ట‌న చేశారు.  స్కూళ్ల‌ను కూడా ఈ రోజు నుంచి తెర‌వ‌నున్నారు.  సుమారు 4 ల‌క్ష‌ల మంది మ‌ళ్లీ త‌మ ప‌నిలో నిమ‌గ్నంకానున్నారు.  టేక‌వే ఫుడ్‌ను తీసుకునేందుకు అనుమ‌తి ఇచ్చారు. వైర‌స్‌ను నియంత్రించే క్ర‌మంలో న్యూజిలాండ్ మార్చి నెల‌లోనే స‌రిహ‌ద్దుల‌ను మూసివేసింది. ఆ దేశంలో 1500 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 18 మంది మ‌ర‌ణించారు.  లాక్‌డౌన్ త‌ర్వాత జ‌నం మ‌ళ్లీ బ‌య‌ట తిరిగేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన ఆనందంలో  ఎంపీ క్రిస్టోఫ‌ర్  ఓ రెస్టారెంట్‌కు వెళ్లి త‌నకు ఇష్ట‌మైన ఫుడ్ ఆర్డ‌ర్ చేశారు.  లాక్‌డౌన్ స‌డ‌లించినా.. మూడ‌వ లెవ‌ల్‌లో ఆంక్ష‌ల‌ను అమ‌లు  చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాని జెసిండా తెలిపారు.


logo