ఆదివారం 31 మే 2020
International - Apr 20, 2020 , 15:09:53

జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్ కాస్తా స‌డ‌లింపు

జ‌ర్మ‌నీలో లాక్‌డౌన్ కాస్తా స‌డ‌లింపు

ఇన్ని రోజులు క‌రోనా మ‌హ‌మ్మారితో జ‌ర్మ‌నీ ఉక్కిరిబిక్కిరి అవ్వ‌గా.... ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కాస్తా  పరిస్థితులు మెరుగవ్వడంతో... జర్మనీ ప్రభుత్వం నెల రోజుల లాక్‌డౌన్ తర్వాత తొలిసారిగా నేటి నుంచి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. కొన్నికొన్ని ఏరియాల్లో చిన్న షాపులు తెరచుకోవచ్చని చెప్పింది.  పూల దుకాణాలు, ఫ్యాషన్ స్టోర్లు, అంటే... 8600 చదరపు మీటర్ల లోపు ఉండే షాపులన్నీ తెరచుకున్నట్లే.  అయితే వాటిలోకి ఇకపై ప్రజలు సోష‌ల్ డిస్టెన్స్‌ పాటిస్తూ వెళ్లవచ్చు. నెల కిందట జర్మనీ లాక్‌డౌన్ విధించినప్పుడు... అత్యంత కఠినంగా అమలుచేసింది. ఇప్పుడు జర్మనీలోని 16 రాష్ట్రాలు... వేర్వేరు ప్రదేశాల్లో నిబంధనల్ని సడలిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం... ఇంకొన్ని రోజులు లాక్‌డౌన్ కఠినంగానే ఉండ‌నుంది.

ప్రస్తుతం జర్మనీలో 1,45,742 కరోనా పాజిటివ్ కేసులు ఉండగా... వాటిలో 91,500 మంది రికవరీ అయ్యారు. ఇంకా 49,600 మంది కరోనాతో పోరాడుతున్నారు. వారిలో కూడా 2,889 మందికి మాత్రమే కరోనా సీరియస్‌గా ఉంది. మిగతావాళ్లకు కరోనా తగ్గిపోయే అవకాశాలు 99 శాతం ఉన్నాయి.  అటు .జర్మనీలో కరోనా మృతుల సంఖ్య 4,642గా ఉంది. ప్రతి 100 మంది కరోనా సోకిన వారిలో అక్కడ ఐదుగురు మాత్రమే చనిపోతున్నారు. అదే ఇటలీలో అయితే 33 మంది, స్పెయిన్‌లో 21 మంది, అమెరికాలో 36 మంది చొప్పున చనిపోతున్నారు. 


logo